Posts

Showing posts from March, 2012

ఊయ్యా...ల...జంపా...ల

Image
నేల పైకెగిరి చూడడం ఒకెత్తు. నేలను ఎగిరేసి చూడడం మరొకెత్తు. చూపు పైకి కిందకి ఊయలాడాలి. పసికందుని  జోకొట్టి మనని మనం ప్రేమించుకున్నట్టు. (అరుదవుతున్న,అయిపోతున్న  జోలపాట పాడే అమ్మలకు,అమ్మమ్మలకు) (31-3-2102)

నిశ్శబ్ద చిత్రం

Image
పల్చటి నల్లటి  మబ్బు చంద్రుడు సమాంతర రేఖలో, వీడ్కోలు చెప్పేవారి ప్రయాణించే  కనుపాపలో మెరిసే నక్షత్రం.

మ్యూరల్స్

మట్టి గోడల్లో విత్తనాలు అలికి దాచారు వాకిళ్ళలో పసిడిపచ్చదనం  అద్దాల గింజలు పొదిగినట్లు.

నెత్తుటి చుక్క

అడవి వెన్నెల్లో మోదుగ ఫూల చెట్టు

ఆత్మ

చివరంకంలో చావుకి సమాధి స్థలం కేటాయించుకుంటారు. సమాధిపై శిలాఫలకాలు చాలాకాలం తర్వాత వస్తాయి. అంతవరకూ ఆత్మలు కలలో తచ్చాడుతాయి. బతికున్నవారు శిలాఫలకాల కోసం రంగుకాయితాలను సేకరించడంలో జీవఛ్చవాలవుతున్నారు. (కపాం,7-3-2012)

పోరాటం

ఎగిరే హార్న్ బిల్ల్  రెక్కల మగ్గం గాలిని కధల శాలువాలా అల్లింది  నాగాల  జీవన పోరాటం  పాటలా పయనించి పరివ్యాప్తి చెందాలని (5-3-2012,రూబెన్ మొషాంబికి)

మిగిలింది...

వరి కంకి గింజల గూళ్ళు ద్వారాలకు వేళ్ళాడం లేదు. పిల్లలాటల్లో పక్షి పిల్లల నేస్తాలు లేరు సేదతీర్చే పప్పు బెల్లాలు లేవు. మనకంటే ముందే ఉదయం అద్దాన్ని ముద్దాడిన కిచ..కిచ...కిచ... మేల్కొలుపు అంతరించిన ధ్వని. బావి నీళ్ళు  గూళ్ళ నీడలు కనిపించడం లేదు. నింగి చినుకు నేల చినుకు  చినుకు,చినుకుల  తడితో ఆడిన పిచ్చుక స్నానం ఒక్కటే మిగిలింది.

తేమ

వాగులో సీతాకోకచిలుకలు నేలపువ్వు పై నీటితేనె రంగుల చుక్కలు.

పసుపుకొమ్ము

Image
పసుపు పుట్టిన  నేల నింగికి ఎరుపు రంగు అద్దింది, సూర్యుడు పసుపు పచ్చని మనస్సు రంగులో నిద్రించాలని. పసుపు కొమ్ము జీనా భువికి గూడులా చల్లగుండాలి. (జీనాకి,కాపాం,7-3-2012)

అడవి నిర్మానుష్యం

వెదురాకుల పైన మంచు బిందువులు రాత్రి మత్తు కళ్ళ తడి:ఉదయం లోని నిశ్శబ్దం చెరువు గట్టు మీద ఒంటరి నడక తనువు నీడ మనస్సు నీడ ఎండా కాలం మిట్ట మథ్యాహ్నం నగరం నడిబొడ్డు మనిషి జాడ లేని అడవి కాలి బాట.

పువ్వు

ఆకుల వింటిబద్ద నుండి వెలువడిన బాణం: మట్టి గళం 

వెలుతురు రేఖ

వరి చేలోని చేప పిల్ల నోట్లో గాలి బుడగ:తెల్ల కనుపాప కొంగ  (ఉక్రుల్  నుండి  ఇంఫాల్,3-3-2102)

వెలుతురు రేఖ

వరి చేలోని చేప పిల్ల నోట్లో గాలి బుడగ:తెల్ల కనుపాప కొంగ  (ఉక్రుల్  నుండి  ఇంఫాల్,3-3-2102)

స్థూపం

స్థూపాల పై నాగా వీరుల పోరాట పాఠాలు చెప్పే ఉపాథ్యాయుడు:చంద్రుడు గాలికి తలూపుతున్న పైన్ వృక్షాలు: విద్యార్ధులు కొన్ని బడులను ఎప్పటికీ మూసివేయలేం. (చాండేల్,7-3-3012)

నలుపు కోవెల

కాకుల జంటను ప్రేమకు చిహ్నంగా పూజిస్తారు తనువు మనస్సు కలయికలో వెలసిన నలుపుకి కోవెలలా... (య్యూయక్ కొండ,కాక్ చింగ్,7-3-2012)

నీటి కుండ

వాగులోని నీరు వెదురు బుట్టలో ఇల్లు చేరింది. ( 3-3-2012,ఉక్రుల్ నుండి ఇంఫాల్ దారిలొ)

అరణ్య రోదన

ఉదయమంతా సూర్యుడూ లేడు కరంటూ లేదు.. అయినా కాలం గడుస్తుంది పనులూ జరుగుతాయి ఇక్కడి లోకం జనజీవన స్రవంతిలో కొట్టుకుపోయింది ప్రపంచానికి బహుదూరం. గిరిజనుడి ఘర్షణ గుండెలోనే ఇంకినట్టు...  (ఉక్రుల్,మణిపూర్-2-3-2012)