Posts

Showing posts from May, 2016

మెమరీ కలెక్టర్స్

అద్దంలో చంద్రుడిలా కారు స్టీరింగ్ మా మధ్యన సౌంజ్ఞల బాష ప్రయాణమంతా ఒకరి మనసులోని భూలే  బిస్రే గీత్లకు మరొకరు ‘వూ’ కొడుతూ - ఇసుక గూళ్ళలో నుండిగత స్మృతుల్ని వెలికి తీసిన చాలా యేళ్ళ తర్వాతిప్రయాణం - నది ఒడ్డున వదిలేసిన పాద ముద్రలు గాలి గొయ్యి మగ్గం పడవ తెరచాప పై రంగులల్లినట్టు వాడు, నేను నెలవంక కాలిబాట దారిలోఒకరి వెనుక మరొకరం సదా ప్రయాణం కొనసాగిస్తూనే వున్నాం.
( హైద్రాబాద్ నుండి కరీంనగర్ ప్రయాణానికి , శ్రవణ్ కి,23-1-2016)