Posts

Showing posts from September, 2010

కొసమెరుపు

కదులుతున్న చీమల దండు ఇక్యం ఒకదాని వెనుకొకటి మమైకం రంగులుమార్చుకునే మబ్బు తెలుపు స్ధానం ఇచ్చిపుచ్చుకున్నాం కొంత మగతని, నిద్రని ఒకరిస్ధానాన్ని మరొకరితొ మరోకరి స్ధానాన్ని మనతో ఆటస్ధలం పిల్లలాడుకునే టైమయ్యింది వాళ్ళ ఆటని చుస్తూ మనం ఆడిన తీరుని చర్చింకుందాం మళ్ళీ రేపటాట మెళకువలకి (19-9-2010)

అతడు

హలో సార్ ఏప్పుడు చేరారు మేడం గారు  బాగున్నారా బాబు బాగున్నాడా ---- ఇది వాడికి యెన్నొ ఫొన్ తెలియదు ఆఫీసులో వాడికి పనిచెప్పడానికి వీలుపడదు చెపితె ఫొన్లో చెప్పాలి ------- సాగర్ నగర్ నుండి మహారానిపేట వరకు సార్ వస్తున్నా  అంటూనే అన్నా,తమ్ముడూ, మామ,బామర్ది ఆంటూ ఆటొలో, బస్సులో, నడక,ఫొన్లో ప్రయాణం విశాఖ నుండీ పాడేరు వరకు అంతే ------ భోజనం,నిద్ర ఒక చేత్తోనె మరో చెతిలొ ఫొన్ ఆఫ్ మైస్ & మెన్ లొని ఒక క్యారెక్టర్ జెబిలొ యెలుకలా యేప్ఫుడూ వాడి దగ్గర వుంటుంది నిద్రిస్త్తునప్పుడు ముసలి అవ్వ  చేతిలో విసనకర్రలా వాడి అరచేతిలొ ఫొన్ విశ్రాంతి పొంతుంది అనుకొవడం భ్రమ దొమ రింగ్ టొన్ ను వీడి హలో ట్యూన్ ఖండిస్తుంది ఇది చూసినప్పుడల్లా గ్రహంబెల్ కి వీడికి పోలిక కనపడుతుంది ఒకరు ఫొన్ కనుక్కుంటే వీడు దానితొ మలేరియా అరికట్టె ప్రయోగం చేశాడు ------- కోరికల్లా నిద్రుస్త్తున విష్ణు పొజ్ లో వీడిని చూడాలని చక్రం బదులుగా సెల్ ఫొన్ తో పడుకున్న పెద్ద ప్లెక్ష్స్ కట్ అవుటులా ఏజెన్సి యెరియాలొ ఓకే ఒక్క కొండంత కట్ అవుట్ యేత్తైన కొండపైన పెట్టాలని -------- ఈ మలుపు దగ్గర

అచ్చంగా...

అచ్చంగా... పదాల పాదాలానీడ రాత్రిలో పడుకుంటాను మెదడంతా అక్షరాల సంభాషణ మేలుకున్న రాత్రి పదం కదులుతుంది తలుపు మూసినా తేరిచినా తేడాలెదు ఆలోచనకంటే మున్ముందే  నిద్రించాలన్న తపన అక్షర సత్యం (17-9-2010)

మౌనవాగు

1. నిశ్శబ్దం మబ్బుగోడ దేవుడు,గుడి, గంట, ఎప్పుడూ ఒకటితో ఒకటి మాట్లాడవు నాప్రార్ధన కూడా నాతోనేను మాట్లాడుకోవడం నీమౌనంతో మాట్లాడే భాషని కల్పించు మాట శబ్దం వాగ్గేయం మౌతుంది  2. నువ్వు,నేను మీరు అందరూ మాట్లాడుతున్నారు కొందరు గొంతుతొ, కొందరు గొంతులో కొన్నిపెదవులు కదులుతున్నప్పుడు కళ్ళూ, చెవులూ మట్లాడుతూవింటాయి   3. వయస్సు చివరంకంలో ఒకపార్కు బెంచిపైన కలం కాలాన్ని నెమరేసుకుంటోంది... ఏ చెట్టూ,పుట్టా గూడూ,వాగూ, వంకా,ఫక్షి నెమరేసుకున్నది చూడలేదు చేశానూ,చేయలేదు అదితప్పు,ఇదిఒప్పు యేదొపొరపాటున జీవితం గడిపినట్టు అంతా తూచ్చ్... చెట్టు  నాటాను పండు నువ్వు తిను 4. నువ్వుమారావు నేనూమారాను నువ్వు,నేను కలిసి మారాం అయినా ఎవరిదారివారిది అప్పుడప్పుడు కలిసినప్పుడు తెలిసినవాళ్ళలా వుందాం కరచాలనం చేసుకుందాం మనపరిమళం కలయిక గంథం మవుతుంది (10/9/2010,విశాఖపట్నం)