మౌనవాగు

1.
నిశ్శబ్దం
మబ్బుగోడ
దేవుడు,గుడి,
గంట,
ఎప్పుడూ ఒకటితో ఒకటి మాట్లాడవు
నాప్రార్ధన కూడా
నాతోనేను
మాట్లాడుకోవడం
నీమౌనంతో
మాట్లాడే
భాషని
కల్పించు
మాట శబ్దం
వాగ్గేయం
మౌతుంది 
2.
నువ్వు,నేను
మీరు
అందరూ
మాట్లాడుతున్నారు
కొందరు
గొంతుతొ,
కొందరు
గొంతులో
కొన్నిపెదవులు
కదులుతున్నప్పుడు
కళ్ళూ,
చెవులూ
మట్లాడుతూవింటాయి

3.
వయస్సు
చివరంకంలో
ఒకపార్కు
బెంచిపైన
కలం కాలాన్ని
నెమరేసుకుంటోంది...
ఏ చెట్టూ,పుట్టా
గూడూ,వాగూ,
వంకా,ఫక్షి
నెమరేసుకున్నది
చూడలేదు
చేశానూ,చేయలేదు
అదితప్పు,ఇదిఒప్పు
యేదొపొరపాటున
జీవితం గడిపినట్టు
అంతా తూచ్చ్...
చెట్టు  నాటాను
పండు నువ్వు
తిను
4.
నువ్వుమారావు
నేనూమారాను
నువ్వు,నేను కలిసి మారాం
అయినా
ఎవరిదారివారిది
అప్పుడప్పుడు
కలిసినప్పుడు
తెలిసినవాళ్ళలా
వుందాం
కరచాలనం చేసుకుందాం
మనపరిమళం
కలయిక గంథం మవుతుంది
(10/9/2010,విశాఖపట్నం)

Comments

 1. Satya Garu, don't have words to say how beautiful your poetry is...

  ReplyDelete
 2. Satya, hats off! so simple yet profound

  ReplyDelete
 3. సత్యా గారు,
  మీ బ్లాగు ఇప్పుడే చూసాను. కవితలు బావున్నాయి. ముఖ్యంగా ఈ కవిత చాలా ఆర్ద్రంగా ఉంది. అభినందనలు. వీలుంటే నా బ్లాగు www.kollurisomasankar.wordpress.com కూడా చూసి, నా అనువాద కథలపై మీ అభిప్రాయం చెప్పండి.
  సోమ శంకర్ కొల్లూరి

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కిటికి ఆవలి జంబో నేరేడు

గోళీలాట

సమాధి ఫలకం మీద అక్షరం