Posts

Showing posts from July, 2015

ఎండుటాకుల వాకిలి

మిట్ట మధ్యాహ్నం నిర్మానుష్యమైన  వీధిలో ఎవరో ఒంటరిగా వెళుతున్నట్టు కంట్లో నుండి జారిపోతున్న ఆలోచనలా గాల్లో ఎగిరి పోతుంటది ఓ ఎండుటాకు సాయంత్రం,  ఎండుటాకులు సంధ్యాకాంతుల  వెలుగు దివ్వెల  చెరువు ఒడ్డు మాటలు లేని జ్ఞాపకాల చూపు రాత్రి ఎండుటాకుల నేలడవి ------ ముంగిట్లో రాలిన ఎండుటాకుల్ని ఉషోదయసంధ్యా కాలాల్లో   ఆమె శుభ్రపరుస్తూనే వుంటుంది అలిగి వెళ్లిన వాళ్ళు ఇల్లు వదల్లేక   అక్కడే తచ్చాడుతునట్టు మళ్ళీ తొలి కిరణాల్లా    అవి ముంగిట్లో వాలుతూనే వుంటాయి
ఎండుటాకుల వాకిలి  మట్టి రేణువు పట్టీల తరంగం
(26-7-15)