Posts

Showing posts from December, 2012

అడవి వేరు

ఘాట్ ఎక్కే ముందు ముక్కు సూటి రహదారి కళ్ళచక్రాలతో ప్రయాణం దారులన్నీ ఇంతే కాబోలు ఎదుగుదల ఆరంభం అంతం తడబడే అడుగులతోనే ఇందుకే మొదలవుతాయి కొండెక్కిన తర్వాత ఆగి దాని అంచున నుంచుని లోయ వైపు చూస్తున్నపుడు ఇక్కడ నుండి కాదు ఇంకా పైనుండి బాగా కనపడుతుందని వృద్థ గిరిజనుడొకడు చెప్పి వెళ్ళి పోయాడు ఆ దారెంటే వెళుతుంటే పూర్వీకుల అడుగు జాడలతో ఏర్పడిన వంకర టింకర బాట పయనమంతా అరికాళ్ళ కళ్ళజోళ్ళతోనే ఇంటికొచ్చిన తర్వాత కడిగిన కాళ్ళ మట్టి తడి అడవి గింజల ముద్రల్లా అచ్చయ్యాయి ప్రయణాలన్నీ తల్లి గర్భ గూటిలోని ఉమ్మినీటి కొలనులోని ఈతలా ( బడంగిపేట్ నుండి మన్ననూర్-28-12-12)

సెగ

అక్కడ శీతాకాలం ఆకుల పైన నీరెండ ఏడు తలల చీమల పుట్ట వెచ్చదనం ఆలొచనల్ని నెమరేసుకుంటున్న గోవులు ఇక్కడ ఆవులకి చెట్లకి చోటు అరుదైపోయింది వీధిన పడ్డ  వలస పక్షులు రోడ్డున చలికాచుకోవడానికి వేసిన నెగళ్ళ నిప్పులో కనిపించని మొహాల్లా వాటి జ్ఞాపకాల వేడి సెగ మెదడ్లోని గంగడోలు  మట్టి గంటల సవ్వడి  (27-12-12)

చేతి రేఖలు

రెండు వేళ్ళ మధ్య నుండి  రాలిన అక్షరాలు ఇప్పుడు చూపుడు వేలు  నుండి జారుతు దించిన తలని ఎత్తి రాత గీతల  చూపు బాటని  పరివ్యాప్తి చేస్తునాయి. అమ్మ కడుపులొని గుప్పెటంత గడియారపు అంకెలు నాన్న టైప్ రైటర్ అక్షరాలు  టేలిప్రింటర్ ద్వారా అచ్చయినట్లు అమె తలస్నాన గింజల్ని ఏరుకుంటున్న పిచుకల్లా అన్నివెళ్ళు గుమికూడతాయి ఇప్పటికి అర్దమైంది అరచేతుల్ని  ముద్దాడే  పెదవి  ప్రెమ (18-12-12,అర్దాంగికి)

కొండల కూన

Image
(ఫొటొ-ఆర్.వి.కే) పొగమంచు పరదాలు చీల్చుకుంటూ ప్రతి ఉదయం మత్స్యగండి నీళ్ళు తీసుకువెళ్ళడం వాళ్ళకు రివాజయ్యింది ప్రతి కాలం వాళ్ళకిది పరిపాటే వాళ్ళ కాళ్ళ కింద పుట్టిన నీరు వాళ్ళ గడప చేరడానికి కొండ కింద గూటి గొంతుకలు పలికే పరిబాష వేరు కొన్ని అద్దాలు పగిలితే కాని వివిధ వేషాల రూపాలు బట్ట బయలవ్వవు నిండు కొండ కుండ  తొలకకుండా వుండదు ఇది కొండ కోన  పలుకు (పెద్ద బయులు ఇంకా మిగితా గిరిజనులకు,16-12-2012)

నేల ముగ్గు

పూలతో నేలను చూసినప్పుడు పచ్చదనం కనుపాపలో గోరింటాకై పండుతుంది

మచ్చిక

నే తిరిగిన ప్రాంతాలన్నీ గాలి పటాల గూళ్ళు ఆమె పొదుగులో ఒదిగిన రాత్రులు నుదిటిన వికసించే సింధూరోదయాలు *** నేనో మట్టి సోకినోడ్ని పయనం  కాంక్ష  ఆమె ఆవరణలో ప్రదక్షణే **** ఇప్పుడు రాత్రి అయింది కళ్ళు తెరిచినా మూసినా కథింతే మేతకి మచ్చికయిన మనస్సు ఇక నెమరేసుకోవడం విశ్రమించిన కాలం వంతు! 2-12-12