అడవి వేరు


ఘాట్ ఎక్కే ముందు
ముక్కు సూటి రహదారి
కళ్ళచక్రాలతో ప్రయాణం
దారులన్నీ
ఇంతే కాబోలు
ఎదుగుదల
ఆరంభం
అంతం
తడబడే అడుగులతోనే
ఇందుకే మొదలవుతాయి
కొండెక్కిన తర్వాత
ఆగి
దాని అంచున నుంచుని
లోయ వైపు చూస్తున్నపుడు
ఇక్కడ నుండి కాదు
ఇంకా పైనుండి
బాగా కనపడుతుందని
వృద్థ గిరిజనుడొకడు
చెప్పి వెళ్ళి పోయాడు
ఆ దారెంటే వెళుతుంటే
పూర్వీకుల అడుగు జాడలతో
ఏర్పడిన
వంకర టింకర బాట
పయనమంతా
అరికాళ్ళ కళ్ళజోళ్ళతోనే
ఇంటికొచ్చిన తర్వాత
కడిగిన కాళ్ళ
మట్టి తడి
అడవి గింజల
ముద్రల్లా
అచ్చయ్యాయి
ప్రయణాలన్నీ
తల్లి గర్భ గూటిలోని
ఉమ్మినీటి కొలనులోని
ఈతలా
( బడంగిపేట్ నుండి మన్ననూర్-28-12-12)

Comments

 1. it is so good. Yes, when we see the zigzag paths in the forest, we feel like meeting with our ancestors and invoking their courage to face life in our own times.

  ReplyDelete
 2. పయనమంతా
  అరికాళ్ళ కళ్ళజోళ్ళతోనే
  ఇంటికొచ్చిన తర్వాత
  కడిగిన కాళ్ళ
  మట్టి తడి
  అడవి గింజల
  ముద్రల్లా
  అచ్చయ్యాయి... చాలా నచ్చిందీ ఫీల్..

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు