Posts

Showing posts from May, 2012

144సెక్షన్

అలజడి తర్వాత  నిశ్శబ్దంలా... నగరం రోడ్లు కుబుసం వదుల్తున్న పాముల్లా... ఒక ఘటన సంఘటన నడుమ నగరం రోడ్లు నిద్రపోవు పోనివ్వవు బతుకుకు వెళ్ళిన వాళ్ళకోసం ఇంట్లో వాళ్ళు కిటికి చువ్వలకు వేళ్ళాడేసిన చూపుల్లా... ఈ అంతరంలో వార్తల్లో విరామంలా నిర్జీవ రోడ్లు కొత్త దుస్తులు వేసుకుంటాయి

శిశిరం

రాలిన ఆకులు పూలు నేల ఎగిరే రంగుల తివాచి. నా చూపు మట్టిలో ఇంకిపోయింది.

సైగలు

చూస్తూండగానే రోడ్డు పైన రద్దీ పెరిగింది ఆమడ దూరం సరిహద్దు దాటలేని కాళ్ళు ట్రాఫిక్ జాం లో సిగ్నల్ ఫోస్ట్ రేఖలా... కరచాలనం ఇక చూపులతోనే పలకరింపులూ వీడ్కోలూ... ఏక కాలంలో

ఖాళీ ఇల్లు

కాకులు జతకట్టే  ప్రయాసలో ఒకదానినొకటి  పిలుచుకుంటూ ఎగురుతూ వెదికే చూపులు

అరికాళ్ళ వేర్లు

Image
ఆకుల రంథ్రాలు శ్వాస తీసుకుంటాయి ఆహారాన్ని ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఆవరణ పచ్చగుండాలని పండుగా రాలి మట్టిలో కలిసిపోతాయి ------ మట్టి బాటలో చూపులా నా శ్వాస సదా ఊపిరి తీసుకోవాలని చిన్నారుల అరికాళ్ళ వేర్ల ముంగిట కళ్ళని వదిలి వెళతా... ------

కళ్ళ చక్రాలు

Image
కొన్ని చక్రాలు కాల క్రమంలో కలిసిపోతాయి నుదిటి చెమట కళ్ళల్లో  తడిమంటలా.. చక్రాలు తోలినవాళ్ళ మొహాలు ఎండిన చెరువు గుట్టలో ఇమిడిపోయి కనిపించని నీటి కళ్ళ నీడ తళుక్కు మరకలా...

పలుకులేని మాట

నోట్లో ఫాల సీసా కళ్ళచేతుల బోసినవ్వుల  సొట్ట బుగ్గల మాటల్ని మనం చూస్తాం. ముదసలితో చేతుల కళ్ళ  మొహాలతో మనం  మట్లాడుతాం.