Posts

Showing posts from April, 2013

నీటి చూపు

నాలొని దూరాన్ని తాకాలని చేయ్యి చాచా మధ్య వేలంచునుంచి తడి చుక్క రాలింది ఉదయం వెదురాకు చివరనున్న మంచుబిందువు నేల నాలుకలొకి జారినట్లు దగ్గర                         దూరం కలయిక                                   ఏడబాటు నీటి బిందువులొని వెలుగు రేణువులు అంతా గుండేబావిలో ఏతమేయడమె (16-2-13)

ఆది వాక్యం

మోదలు తుదలు చూపని ఇంద్రధనుస్సు హరివిల్లు చీమల పుట్ట నుండే పుట్టిందందన్నది గోండుల వాక్కు పుట్టినప్పుడు తెరిచినచూపు పొయింతర్వాత మూసుకుంటుంది జీవితానికి ముందు వెనక మాటలుండవు నడక నెర్చిన చొటే చూపునిలవాలి (15-2-13)

వ్యుహ దిశ

గాలి పటం కొసం పరిగెత్తిన కళ్ళు చేరువు గట్టున ఆగిపొయాయి గాలి పటం  నీళ్ళలొ పిల్లాడి కళ్ళలొను... గుండెల్లోని ఉక్రొషం రాయై నీటికి నింగికి మధ్యలొనున్న మందచర్మానికి తగిలింది దెబ్బకి కదిలన గేదె కొమ్మునుండి రంగుల కాగితం జలంలొకి దూసుకువస్తూన్న లకుముకి పిట్ట గురితప్పింది నీరునుంచి పైకెగిరిన చేప  శ్వాస బుడుంగన్న  బుడగ అబే! గటు సూడు మల్లొక పతంగ్ కాట్ అయ్యింద్రా!! ఇప్పుడు పరుగటు గాల్లో లకుముకిపిట్ట చక్కర్లు... (16-2-13)

శ్వాస నుడీకారం

సూర్య కిరణం నేలను ముద్దాడినట్టు నేను  ఆమె పెదవుల తడిని చప్పరించా గొంతులొని  జీవ నది ఇంకి గుండెలొ ఊటైంది నాలిక కౌగిలి తేమ పొడి కళ్ళకు ఓదార్పునిచ్చింది కడుపులొ  మబ్బుల సంద్రం కదిలింది దిగువ ఎగువల వైపు సాగె కాంతి పడవల  చేపల వూపిరి శ్వాసలొ మిళితమైంది లొలొని ప్రాణాలింగనం అలుపెరుగని  ప్రేమ చిత్రమైంది (13-2- 13)

ఖ్వాజా మేరే ఖ్వాజా

ఆమె కాటుక నేత్రాల కింద తడి బాధ  నేను కళ్ళలో సూటిగా చూడలేక పొయా ఇంకా నీళ్ళు తచ్చాడు తూనె వున్నాయి ఆమె రెప్పలో నా అడుగులకింద నలుగుతున్న మనస్సులో కలిసి వుండె గూట్లో ఇద్దరి గుండెల్లో  రోదనని మౌన చూపులతో వినే శ్రోత బాల్యం పొదరిల్లుని తిరిగి సవరించే పసి మౌలా నవ్వు అమాయకపు స్వచ్ఛత సాంబ్రాణి ధూపంలా కమ్మేస్తుంది మళ్ళీ గూడు బుద్ధుడి ధ్యాన  ముద్ర  ప్రేమ వాకిలవుతుంది 7-2-13 శిశిర్ కి