ఖ్వాజా మేరే ఖ్వాజా
ఆమె కాటుక నేత్రాల
కింద
తడి బాధ
నేను
కళ్ళలో
సూటిగా చూడలేక పొయా
ఇంకా నీళ్ళు తచ్చాడు తూనె వున్నాయి
ఆమె రెప్పలో
నా అడుగులకింద నలుగుతున్న మనస్సులో
కలిసి వుండె గూట్లో
ఇద్దరి గుండెల్లో
రోదనని
మౌన చూపులతో
వినే శ్రోత
బాల్యం
పొదరిల్లుని తిరిగి సవరించే
పసి మౌలా నవ్వు
అమాయకపు స్వచ్ఛత
సాంబ్రాణి ధూపంలా
కమ్మేస్తుంది
మళ్ళీ గూడు
బుద్ధుడి ధ్యాన ముద్ర
ప్రేమ వాకిలవుతుంది
7-2-13
శిశిర్ కి
yemani raayaali.
ReplyDelete