Posts

Showing posts from September, 2014

వెదురు వర్షపు చుక్కలు

Image
వింటి బద్ద బాణం చూపు పశువుల్ని కాచే ముల్లు కర్ర ఇంటి దూలం ముచ్చట్ల తరంగాల  తూనీగ : వెదురాకు రెక్క వెదురుకూర :  గూటిలో మొలిచిన పుట్ట మన్ను పువ్వు వెదురన్నం :నేలగంధ  పరిమళపు బువ్వ రాత్రింబవళ్ళ గాలి రాగాల  నదీ గీతం :వెదురు వేణువు వెదురు పొదల సవ్వడి ; వెన్నంటి  కాచే గురవడి[1]పలుకులు నా అడవి గుండె చప్పుడు : :పోతరాజు[2] గుఱ్ఱం అడుగుల ముద్ర ముగింపును గెలుపు సంకేతంగా ఎగరేసుకు పోయే పిట్ట : వెదురు పువ్వు మలుపుల దారిలో  ఇంకా కొండ గుర్తుగా  కళ్ళ గడపెదుటే నిల్చే వున్నాయి
(ప్రపంచ వెదురు పొదల దినోత్సవం) 19/09/2014




[1]గిరిజన పూజారి [2]వెదురు పొదను పోతరాజు గా పూజిస్తారు