Posts

Showing posts from May, 2013

వెన్నెల్లో చెట్లకి నీళ్ళు పోయడం

ఆమె శిల్పం తమలపాకు మీద నీటి చుక్క ఆమె తలంపులతో రమిస్తూ తడిసిపోతున్న నేను (24-5-13)

విన్నపం

కొట్టేసిన చెట్టు  మనస్సు  మళ్ళీ చిగురించినట్టు మొలక ప్రార్ధనా గీతం ప్రతిధ్వనిస్తుంది మనిషి మతంలోని రక్తహింస గుండె మారదేంది! అల్లా దేవుడా యేసు!! ఆకుపచ్చ నేలకోక  యెరుపెక్కుతోందయ్యా సాములు మీ గుడి మెట్లమట్టిని మీ నింగి పాదాల కాడైన పెట్టుకొండ్రి మీకు దండంపెడతా నా విత్తు మొలకెక్కక ముందే బొందలో కలవదన్న భరొసా అన్నా మిగుల్తది మీ ఆశీర్వాదముంటది గీ మట్టికి  సెట్టు సుప్రభాతం పొద్దుగాల నమాజ్ శుభొదయ పాట మీమీదొట్టు (13-4-13)

కంబఖ్త్ దిల్ కి సుబాన్

భూమి తిరుగుతునప్పుడు దాని చుట్టూ అల్లుకున్న గాలి చప్పుడు చేరువలోనే వున్న గ్రహాంతర వాసుల నిశబ్ధ ఘోష పర్దా చాటున  ఆమె కళ్ళ మౌన కబూల్ కనురెప్పల చెరసాలలొని నా కనుపాప కబూల్ సుహాగ్ రాత్ చూపుల సొరంగ మార్గం (12-5-13)

ఇదీ వరస

వెదురు పొదలో నలుపునీలిరంగు పిట్టగూడు చీకట్లొ పొద పులుగు రంగు పులుముకుని గాలి తాకిడికి గారాబం ఒలికిస్తుంది వేకువ పక్షి గంజివార్చడానికి వెదురాకు రెక్కలుతొడిగి గింజంత సూర్యుడ్ని  ముక్కున కర్చుకుని రాడానికి వెళుతుంది (12-3-13,మా వెదురు పొద)

అమ్మ చూపులా...

నడుస్తున్న పాదాలు ఆగి కట్ట మీద గండి మైసమ్మకు చేతులు జోడించాయి అన్నీ ఇళ్ళలొని దేవుడి పటాలు అక్కడె కొలువైయ్యాయి అమ్మ పోయినప్పుడు అక్కడి ప్రమిదని తెచ్చి దీపం వెలిగించా అన్ని దినాలు వెలిగింది (14-2-13, గాంధినగర్ చెరువు కట్ట)

పొట్రైట్ ఆఫ్ బాల్కని

చీకటిలో నెలవంక నిచ్చనకి వెలాడుతున్న సున్నండబ్బా బాల్కనిలోని హంగింగ్ బౌల్ లొని ఏప్పడూ పూసే తెలుపు చారల లేత ఏరుపురంగల గుత్తుల పూలు పేంట్ బ్రష్ పకృతి చిత్రకారులు అనానిమస్ పేంటర్లు నా చూపులు  వాళ్ళని అన్వేషించే గ్యాలరి (మా బాల్కని,14-2-13)