విన్నపం
కొట్టేసిన చెట్టు
మనస్సు
మళ్ళీ చిగురించినట్టు
మొలక ప్రార్ధనా
గీతం
ప్రతిధ్వనిస్తుంది
మనిషి మతంలోని
రక్తహింస గుండె
మారదేంది!
అల్లా దేవుడా యేసు!!
ఆకుపచ్చ నేలకోక
యెరుపెక్కుతోందయ్యా సాములు
మీ గుడి మెట్లమట్టిని
మీ నింగి పాదాల కాడైన
పెట్టుకొండ్రి
మీకు దండంపెడతా
నా విత్తు మొలకెక్కక ముందే
బొందలో కలవదన్న
భరొసా
అన్నా మిగుల్తది
మీ ఆశీర్వాదముంటది
గీ మట్టికి
సెట్టు
సుప్రభాతం
పొద్దుగాల నమాజ్
శుభొదయ పాట
మీమీదొట్టు
(13-4-13)
కళ్ళముందు ప్రకృతీ.. మనలోని వికృతులను కలిపి కాన్వాస్ మీద అక్షర కుంచెనొలికించారు సత్యగారూ...
ReplyDeleteగీ మట్టికి
సెట్టు
సుప్రభాతం
పొద్దుగాల నమాజ్
శుభొదయ పాట
మీమీదొట్టు
** ఇలాంటి ఎన్ని వొట్లనన్నా గట్టు మీద పెట్టెయ్యగలిగే కృరత్వాన్ని పోగేసుకున్నాం మరి.. లేకపోతే.. పచ్చదనాన్ని చూస్తే మనిషి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు.. ఆ చెట్ల అంతు చూసేదాకా నిద్రపోడే..
jaya sree garu ,thanks andi
ReplyDelete