Posts

Showing posts from August, 2010

గుణం

Image

టూరిజం

Image

మట్టిపూలు

మొగ్గలు
పూలై...
వాడిపోయేంత
సమయంలో
మాట
ఒకింటినుండి
మరొకింటికి
మాట స్థలంలో
వుంటాం
రవ్వంత అలికిడికి
నీటిమూటలోని
వెలుతురు
కదలికలా
మారుతాం
చూపులోని
దూరం...
పెదవిపై
మనస్సు
నవ్వు
మాట
ఒట్టి
మట్టి పువ్వు

(ఇంట్లొ,1,2006)


--

సెందురూడా...సెందురూడా...

Image

రేపు...

మిగిలున్న
ఆదిమానవుల్లా
పుడమి వీథిలో
విశ్రమించినట్లున్నాయి
చీకట్లో చెట్లు
దూరంగా
అటూ ఇటూ వెళుతూన్న
వాహనాలు
రోజుకొక గమ్యం
రోజుకొక మార్గం
అక్కడ
వర్షం
ఇక్కడ
చినుకు రంగు పులుముకున్న
మబ్బు
అక్కడిదిక్కడికి
వచ్చేలోపు విరామం లేకుండా
పరుగెత్తడం
రేపు మిగిలేదల్లా
విడిది లేని
చెట్ల నీడ
(పోరంకి నుండి తిమ్మసముద్రం,22-8-2010)


--
Satyasrinivas

నీటిమొహం

Image

అంతే

Image

శిశిర నిద్ర

Image

రవి

వీడొక
దిగంబర కనుపాప
తొలకరి
రెల్లుపువ్వు
నడెండలో మోదుగ నవ్వు
శిశిర
టేకాకు
పోడునేలలో
పాదముద్ర
సదా ప్రవహించే
ఆడవి వేరు
నింగిలోని
సంచార నేల నక్షత్రం

--
Satyasrinivas

తలంపు

కలయిక... ఒక గజల్,నజమ్,షేర్ వీడ్కోలు మాట దేవుడునిన్ను రక్షించు గాక... ని విరహ గుండె చప్పుడు నన్ను వెంటాడుతూనే వుంటుంది

ఇళ్ళూ వాకిళ్ళు

ఒక్కోఘడియ
రెప్పమూసి  తెరిచేకాలం
ముసలితల్లి ఇంట్లో
ఓ పురాతన దీపపు
ఛాయ

 కనుచూపు సన్నగిల్లిన కాలం
దీపు,ఉదయ్‌
ఎవరి కొలనులో వాళ్ళు

అమె వస్తూ....వెళ్తూ...
ప్రపంచయాత్రలో అప్పటి
నావకు ఇప్పుడు ప్రాణం వచ్చినట్లు
సరంగులు మారారు
కాలం మాత్రం
రెప్ప తెరచి మూయడమే
మేమూ అంతే

గడియారంలో
ముల్లులా
 కలయిక కాలం తక్కువ
జ్ఞాపకమే కొనసాగింపు

అతడు ఆమె
పిల్లాపీచు
అంతా ఇంతే
కదిలే ఇంట్లో
నిశ్వాస
రెప్పపాటు ఘడియ

కొండపైన

నెలవంక
కొండంచున
కుంపట్లో
నిప్పు
కొండగాలి
మళ్ళింది                                                 
దీపాలారిపోయాయి.

----  (గాంధీనగర్‌ కొండ)

కిటికీలు

ఒక్కిల్లు
నాల్గు గదులు
ఓ చూపు కనుమూసుకునేది
మరో చూపు
కనుమూసుకునే కాలంలో తెరిచే వుంటుంది
ఇంకొక చూపు
కావలి కాస్తూ....
ఎవరి గదుల్లో వాళ్ళు
రేయింబవళ్ళు నిశాచరులు
ఒక్కిల్లు
నాల్గు గదులు
అందులోఒక గది
శ్వాస నిశ్వాస గూడు
వచ్చిపోయే కాలం
అలలతో కొట్టుకొచ్చిన ప్రాణం
ఒడ్డునింకిపోయే ఓర్పు  ఒకిల్లంత గది
మూడు కిటికీలు...
ఆవలి పోయిన చూపు ఇల్లు చేరాలి.
కంటి గూట్లో జ్ఞాపకాలు
గూడు కట్టుకున్నాయి

కిటికీల్ని మూసేస్తే
గదులు జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ
ఇళ్ళలా శిధిలమైపోతాయి...
కిటికీలు తెరిచే వుంచండి
ఇళ్ళన్నా పదిలంగా వుంటాయి...
ఓ మౌన గీతం సూఫీ పాటలా
 ఇంటిచుట్టూ తచ్చాడుతుంది...

ఇళ్ళు మారడం

ఇళ్ళు మారడం
శిశిర
వసంతంలాగుండాలి
నేల
ప్రతివక్కరి
గూడవుతుంది
మట్టిగంధానికి
తోలకరి
తడిలా....

(బాలాపుర్‌)

యాన్‌ ఆబ్‌విచ్యురి

వసంతాలు మళ్ళినా
వాగుల్లో శ్వాస
వదలాలన్న
తుదియత్నం
ఫలించలేదు!

వసంతాలన్నీ
వాగులకోసం
మళ్ళవు
వర్ణాలు మార్చవు

యట్టకేలకు
అలసిన మరణాన్ని
ఆశ్వాదించావు....

ని పిడికిలిలో
బిగిసిన
రేఖలా
నిన్ను
సదా జపిస్తాను

నీశ్వాస
వాగై,వంకై
ప్రవహిస్తుంది

నువ్వు విశ్రమించు

--  (కోటమ్మకి)

ముద్దు

పగటకి మునుపే
తీతువ కూత
ఉషోదయం
తీతువమ్మ నుదుటి
సింధూరం

Nela Kannu

Image
'Nela Kannu', an anthology of poems written by me, is now available for free download from Vikasa Dhatri, a website offering Telugu e-Books for download at no cost.


Download

ఫేస్‌ బుక్‌

ఇపుడెవర్నెవరూ
కలుసుకునే
తీరిక, అవసరం లేదు
ఎవరి బ్లాగ్‌లో, గ్రూపులో వాళ్ళు
కలవాలనిపించినపుడు
మెయిల్‌లో, ఛాట్‌లో
మన  అబిచ్యురి సంభాషణ
సేవింగ్స్‌, ట్రాన్‌సాక్షన్స్‌
అన్నీ  వేళ్ళ చివర్నించి జరిగిపోతాయి
---
పాత మిత్రుడు
చాలా కాలం తర్వాత
ఊరవతలింటికొచ్చాడు
అమ్మ, వాడి బాగోగుల ముచ్చట్లయ్యాక,
 వాడి భుజాలెత్తుకెదిగిన
నా  కొడుకు వాడ్ని గుర్తుపట్టకపోయినా
జ్ఞాపకంలేదంటూనే  అన్న పలకరింపులో
ప్రేమ  తొణికిసలాడింది
---
వీడి పసిడి ఆప్యాయత
వాడలవాటు
మారలేదు
---
అప్పుడప్పుడు కలుద్దాం...
మున్ముందు
ఫేస్‌బుక్‌లు అప్‌డేట్‌ అవుతాయి.

- జి. సత్య శ్రీనివాస్‌