కిటికీలు

ఒక్కిల్లు
నాల్గు గదులు
ఓ చూపు కనుమూసుకునేది
మరో చూపు
కనుమూసుకునే కాలంలో తెరిచే వుంటుంది
ఇంకొక చూపు
కావలి కాస్తూ....
ఎవరి గదుల్లో వాళ్ళు
రేయింబవళ్ళు నిశాచరులు
ఒక్కిల్లు
నాల్గు గదులు
అందులోఒక గది
శ్వాస నిశ్వాస గూడు
వచ్చిపోయే కాలం
అలలతో కొట్టుకొచ్చిన ప్రాణం
ఒడ్డునింకిపోయే ఓర్పు  ఒకిల్లంత గది
మూడు కిటికీలు...
ఆవలి పోయిన చూపు ఇల్లు చేరాలి.
కంటి గూట్లో జ్ఞాపకాలు
గూడు కట్టుకున్నాయి

కిటికీల్ని మూసేస్తే
గదులు జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ
ఇళ్ళలా శిధిలమైపోతాయి...
కిటికీలు తెరిచే వుంచండి
ఇళ్ళన్నా పదిలంగా వుంటాయి...
ఓ మౌన గీతం సూఫీ పాటలా
 ఇంటిచుట్టూ తచ్చాడుతుంది...

Comments

  1. ఓ మౌన గీతం సూఫీ పాటలా
    ఇంటిచుట్టూ తచ్చాడుతుంది...

    adbutham gaa undi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు