ఇళ్ళూ వాకిళ్ళు

ఒక్కోఘడియ
రెప్పమూసి  తెరిచేకాలం
ముసలితల్లి ఇంట్లో
ఓ పురాతన దీపపు
ఛాయ

 కనుచూపు సన్నగిల్లిన కాలం
దీపు,ఉదయ్‌
ఎవరి కొలనులో వాళ్ళు

అమె వస్తూ....వెళ్తూ...
ప్రపంచయాత్రలో అప్పటి
నావకు ఇప్పుడు ప్రాణం వచ్చినట్లు
సరంగులు మారారు
కాలం మాత్రం
రెప్ప తెరచి మూయడమే
మేమూ అంతే

గడియారంలో
ముల్లులా
 కలయిక కాలం తక్కువ
జ్ఞాపకమే కొనసాగింపు

అతడు ఆమె
పిల్లాపీచు
అంతా ఇంతే
కదిలే ఇంట్లో
నిశ్వాస
రెప్పపాటు ఘడియ

Comments

  1. హాయ్ సత్య శ్రీనివాస్, పద్యం బాగుంది. 'గడియారంలో
    ముల్లులా కలయిక కాలం తక్కువ' వంటి పోలికలు బాగున్నాయి. అప్పుడు ఇరానీ తేనీటి పొగల మధ్య ఒకకొకరం వినిపించిన పద్యాల్ని ఇలా ఎవరి టీ వాళ్లం తాగుతూ, ఎవరి సిగరెట్లు వాళ్లం తగలేస్తూ ఎవరికి వాళ్లమైనా చదువుకుందాం. థమ్స్ అప్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు