శ్వాస నుడీకారం
సూర్య కిరణం
నేలను
ముద్దాడినట్టు
నేను
ఆమె పెదవుల
తడిని చప్పరించా
గొంతులొని జీవ నది ఇంకి
గుండెలొ ఊటైంది
నాలిక కౌగిలి తేమ
పొడి కళ్ళకు ఓదార్పునిచ్చింది
కడుపులొ మబ్బుల సంద్రం
కదిలింది
దిగువ ఎగువల వైపు సాగె
కాంతి పడవల
చేపల వూపిరి
శ్వాసలొ మిళితమైంది
లొలొని ప్రాణాలింగనం
అలుపెరుగని
ప్రేమ చిత్రమైంది
(13-2- 13)
Comments
Post a Comment