వ్యుహ దిశ
గాలి పటం కొసం పరిగెత్తిన కళ్ళు
చేరువు గట్టున ఆగిపొయాయి
గాలి పటం
నీళ్ళలొ
పిల్లాడి కళ్ళలొను...
గుండెల్లోని
ఉక్రొషం రాయై
నీటికి నింగికి మధ్యలొనున్న
మందచర్మానికి
తగిలింది
దెబ్బకి
కదిలన గేదె
కొమ్మునుండి
రంగుల కాగితం
జలంలొకి
దూసుకువస్తూన్న
లకుముకి పిట్ట
గురితప్పింది
నీరునుంచి
పైకెగిరిన
చేప
శ్వాస
బుడుంగన్న
బుడగ
అబే!
గటు సూడు
మల్లొక
పతంగ్ కాట్ అయ్యింద్రా!!
ఇప్పుడు పరుగటు
గాల్లో
లకుముకిపిట్ట
చక్కర్లు...
(16-2-13)
beautiful imagery...
ReplyDelete