సెగ
అక్కడ
శీతాకాలం
ఆకుల పైన
నీరెండ
ఏడు తలల చీమల పుట్ట
వెచ్చదనం
ఆలొచనల్ని
నెమరేసుకుంటున్న
గోవులు
ఇక్కడ
ఆవులకి
చెట్లకి చోటు
అరుదైపోయింది
వీధిన పడ్డ
వలస పక్షులు
రోడ్డున చలికాచుకోవడానికి
వేసిన నెగళ్ళ నిప్పులో
కనిపించని
మొహాల్లా
వాటి
జ్ఞాపకాల వేడి సెగ
మెదడ్లోని గంగడోలు
మట్టి గంటల
సవ్వడి
(27-12-12)
Comments
Post a Comment