కొండల కూన


(ఫొటొ-ఆర్.వి.కే)

పొగమంచు పరదాలు
చీల్చుకుంటూ
ప్రతి ఉదయం
మత్స్యగండి
నీళ్ళు తీసుకువెళ్ళడం
వాళ్ళకు రివాజయ్యింది
ప్రతి కాలం
వాళ్ళకిది
పరిపాటే
వాళ్ళ కాళ్ళ కింద
పుట్టిన నీరు
వాళ్ళ గడప చేరడానికి
కొండ కింద
గూటి గొంతుకలు
పలికే పరిబాష వేరు
కొన్ని అద్దాలు పగిలితే కాని
వివిధ వేషాల రూపాలు
బట్ట బయలవ్వవు
నిండు కొండ కుండ 
తొలకకుండా
వుండదు
ఇది కొండ కోన 
పలుకు
(పెద్ద బయులు ఇంకా మిగితా గిరిజనులకు,16-12-2012)

Comments

  1. Baagundi Stya. Konda kunda tolakkundaa undadu. tolukutundi. Evruu Emee chEyyaleru. aa sangathi Emayinaa, ippudu vaallaku kaasinni neellu ivvalEraa illa daggara. Aa pani chaala chOtla jarugutOndi kadaa.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు