చేతి రేఖలు
రెండు వేళ్ళ మధ్య నుండి
రాలిన అక్షరాలు
ఇప్పుడు
చూపుడు వేలు
నుండి జారుతు
దించిన తలని ఎత్తి
రాత గీతల
చూపు బాటని
పరివ్యాప్తి చేస్తునాయి.
అమ్మ కడుపులొని
గుప్పెటంత గడియారపు
అంకెలు
నాన్న టైప్ రైటర్
అక్షరాలు
టేలిప్రింటర్ ద్వారా
అచ్చయినట్లు
అమె తలస్నాన గింజల్ని
ఏరుకుంటున్న పిచుకల్లా
అన్నివెళ్ళు గుమికూడతాయి
ఇప్పటికి అర్దమైంది
అరచేతుల్ని ముద్దాడే
పెదవి ప్రెమ
(18-12-12,అర్దాంగికి)
Comments
Post a Comment