మచ్చిక


నే తిరిగిన ప్రాంతాలన్నీ
గాలి పటాల గూళ్ళు
ఆమె పొదుగులో ఒదిగిన
రాత్రులు
నుదిటిన వికసించే
సింధూరోదయాలు
***

నేనో
మట్టి సోకినోడ్ని
పయనం 
కాంక్ష 
ఆమె ఆవరణలో
ప్రదక్షణే
****
ఇప్పుడు
రాత్రి అయింది
కళ్ళు
తెరిచినా
మూసినా
కథింతే
మేతకి
మచ్చికయిన
మనస్సు
ఇక
నెమరేసుకోవడం
విశ్రమించిన
కాలం వంతు!


2-12-12

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు