ఎండుటాకుల వాకిలి

మిట్ట మధ్యాహ్నం
నిర్మానుష్యమైన  వీధిలో
ఎవరో ఒంటరిగా వెళుతున్నట్టు
కంట్లో నుండి జారిపోతున్న ఆలోచనలా
గాల్లో ఎగిరి పోతుంటది ఓ ఎండుటాకు
సాయంత్రం,  ఎండుటాకులు
సంధ్యాకాంతుల  వెలుగు దివ్వెల  చెరువు
ఒడ్డు
మాటలు లేని జ్ఞాపకాల చూపు
రాత్రి
ఎండుటాకుల నేలడవి
------
ముంగిట్లో రాలిన ఎండుటాకుల్ని
ఉషోదయసంధ్యా కాలాల్లో  
ఆమె శుభ్రపరుస్తూనే వుంటుంది
అలిగి వెళ్లిన వాళ్ళు ఇల్లు వదల్లేక  
అక్కడే తచ్చాడుతునట్టు
మళ్ళీ తొలి కిరణాల్లా   
అవి ముంగిట్లో వాలుతూనే వుంటాయి

ఎండుటాకుల వాకిలి 
మట్టి రేణువు పట్టీల తరంగం

(26-7-15)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు