కొసమెరుపు

కదులుతున్న
చీమల దండు
ఇక్యం
ఒకదాని వెనుకొకటి
మమైకం
రంగులుమార్చుకునే
మబ్బు తెలుపు
స్ధానం
ఇచ్చిపుచ్చుకున్నాం
కొంత మగతని,
నిద్రని
ఒకరిస్ధానాన్ని
మరొకరితొ

మరోకరి
స్ధానాన్ని
మనతో
ఆటస్ధలం
పిల్లలాడుకునే
టైమయ్యింది
వాళ్ళ ఆటని
చుస్తూ
మనం
ఆడిన తీరుని
చర్చింకుందాం

మళ్ళీ
రేపటాట
మెళకువలకి
(19-9-2010)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు