మెమరీ కలెక్టర్స్

అద్దంలో చంద్రుడిలా
కారు స్టీరింగ్
మా మధ్యన సౌంజ్ఞల బాష
ప్రయాణమంతా
ఒకరి మనసులోని భూలే  బిస్రే గీత్లకు
మరొకరు
‘వూ’ కొడుతూ
-
ఇసుక గూళ్ళలో నుండి గత స్మృతుల్ని వెలికి తీసిన చాలా యేళ్ళ తర్వాతి ప్రయాణం
-
నది ఒడ్డున వదిలేసిన
పాద ముద్రలు
గాలి గొయ్యి మగ్గం
పడవ తెరచాప పై
రంగులల్లినట్టు
వాడు, నేను
నెలవంక కాలిబాట దారిలోఒకరి వెనుక మరొకరం
సదా ప్రయాణం కొనసాగిస్తూనే వున్నాం.

( హైద్రాబాద్ నుండి కరీంనగర్ ప్రయాణానికి , శ్రవణ్ కి,23-1-2016)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు