మిగిలింది...
వరి కంకి గింజల
గూళ్ళు
ద్వారాలకు
వేళ్ళాడం లేదు.
పిల్లలాటల్లో పక్షి పిల్లల నేస్తాలు లేరు
సేదతీర్చే పప్పు బెల్లాలు లేవు.
మనకంటే ముందే
ఉదయం అద్దాన్ని
ముద్దాడిన
కిచ..కిచ...కిచ...
మేల్కొలుపు
అంతరించిన ధ్వని.
బావి నీళ్ళు
గూళ్ళ నీడలు
కనిపించడం లేదు.
నింగి చినుకు
నేల చినుకు
చినుకు,చినుకుల
తడితో ఆడిన
పిచ్చుక స్నానం
ఒక్కటే మిగిలింది.
Comments
Post a Comment