అడవంతా తిరిగిన తర్వాత ఏమీ తిరగలేదనిపించింది ఇంట్లోనే వున్నప్పుడు అంతా చూసిందే అన్న భ్రమ ----- పాము గడప దాటుతూ తిరిగొచ్చి రెండు గోడల సందున పడుకున్నట్టు.
మెట్లు అంకితమైన కళ్ళు నిశాచర ఉమ్మడి జ్ఞాపకాలోచనలతో మొలిచిన సమాథి పరిమళం సరిహద్దులు లేని ప్రాంతంలో మట్టి పచ్చని చోటయ్యింది ----- వెళ్ళి సాంబ్రాణి గాలి పాటల్లో ధ్యానించాలి.
నీటి చుక్క ఆవిరైన మగతలో పడుకున్నాడు నేల చిట్లి వర్షపు చుక్క బుగ్గలా పొంగాలన్న కలలో నడిచాడు ఉదయం పంట మృతి మన్నుకూతలా కోడి రోదన ----- నీటి బిందువు పుడమిచితిలో ఆత్మాహుతయ్యింది ------ ప్రతి వర్షం వానస్వాప్నికుల దేహపొలం సమాథి ------- మట్టిగడీల గోరీల్లో గడ్డి పువ్వు వాన స్వాప్నికుల జ్ఞాపకం
మొలకల కలల్ని నాటి ... కళ్ళల్లో తేమ బిందువుల్ని జల్లండి తడి నేల వేర్ల అడవి ఉమ్మనీరవుతుంది. అప్పుడప్పుడు ఆకుల్ని నిమరండి. ----- అడవిని నాటగా! పెంచగా!! నేనేప్పుడూ, చూడలేదు!!! నా అరణ్యవాసం నేర్పుతున్న సూత్రం. మొలకల కలల్ని నాటి ...