వాన స్వాప్నికులు


నీటి చుక్క
ఆవిరైన మగతలో
పడుకున్నాడు
నేల చిట్లి
వర్షపు చుక్క
బుగ్గలా
పొంగాలన్న
కలలో
నడిచాడు
ఉదయం
పంట మృతి
మన్నుకూతలా
కోడి రోదన


-----
నీటి బిందువు
పుడమిచితిలో
ఆత్మాహుతయ్యింది
------
ప్రతి
వర్షం
వానస్వాప్నికుల
దేహపొలం
సమాథి
 -------


మట్టిగడీల
గోరీల్లో
గడ్డి
పువ్వు
వాన స్వాప్నికుల
జ్ఞాపకం

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు