Posts
Showing posts from August, 2010
రేపు...
- Get link
- X
- Other Apps
మిగిలున్న ఆదిమానవుల్లా పుడమి వీథిలో విశ్రమించినట్లున్నాయి చీకట్లో చెట్లు దూరంగా అటూ ఇటూ వెళుతూన్న వాహనాలు రోజుకొక గమ్యం రోజుకొక మార్గం అక్కడ వర్షం ఇక్కడ చినుకు రంగు పులుముకున్న మబ్బు అక్కడిదిక్కడికి వచ్చేలోపు విరామం లేకుండా పరుగెత్తడం రేపు మిగిలేదల్లా విడిది లేని చెట్ల నీడ (పోరంకి నుండి తిమ్మసముద్రం,22-8-2010) -- Satyasrinivas
ఇళ్ళూ వాకిళ్ళు
- Get link
- X
- Other Apps
ఒక్కోఘడియ రెప్పమూసి తెరిచేకాలం ముసలితల్లి ఇంట్లో ఓ పురాతన దీపపు ఛాయ కనుచూపు సన్నగిల్లిన కాలం దీపు,ఉదయ్ ఎవరి కొలనులో వాళ్ళు అమె వస్తూ....వెళ్తూ... ప్రపంచయాత్రలో అప్పటి నావకు ఇప్పుడు ప్రాణం వచ్చినట్లు సరంగులు మారారు కాలం మాత్రం రెప్ప తెరచి మూయడమే మేమూ అంతే గడియారంలో ముల్లులా కలయిక కాలం తక్కువ జ్ఞాపకమే కొనసాగింపు అతడు ఆమె పిల్లాపీచు అంతా ఇంతే కదిలే ఇంట్లో నిశ్వాస రెప్పపాటు ఘడియ
కిటికీలు
- Get link
- X
- Other Apps
ఒక్కిల్లు నాల్గు గదులు ఓ చూపు కనుమూసుకునేది మరో చూపు కనుమూసుకునే కాలంలో తెరిచే వుంటుంది ఇంకొక చూపు కావలి కాస్తూ.... ఎవరి గదుల్లో వాళ్ళు రేయింబవళ్ళు నిశాచరులు ఒక్కిల్లు నాల్గు గదులు అందులోఒక గది శ్వాస నిశ్వాస గూడు వచ్చిపోయే కాలం అలలతో కొట్టుకొచ్చిన ప్రాణం ఒడ్డునింకిపోయే ఓర్పు ఒకిల్లంత గది మూడు కిటికీలు... ఆవలి పోయిన చూపు ఇల్లు చేరాలి. కంటి గూట్లో జ్ఞాపకాలు గూడు కట్టుకున్నాయి కిటికీల్ని మూసేస్తే గదులు జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ ఇళ్ళలా శిధిలమైపోతాయి... కిటికీలు తెరిచే వుంచండి ఇళ్ళన్నా పదిలంగా వుంటాయి... ఓ మౌన గీతం సూఫీ పాటలా ఇంటిచుట్టూ తచ్చాడుతుంది...
ఫేస్ బుక్
- Get link
- X
- Other Apps
ఇపుడెవర్నెవరూ కలుసుకునే తీరిక, అవసరం లేదు ఎవరి బ్లాగ్‌లో, గ్రూపులో వాళ్ళు కలవాలనిపించినపుడు మెయిల్‌లో, ఛాట్‌లో మన అబిచ్యురి సంభాషణ సేవింగ్స్, ట్రాన్‌సాక్షన్స్ అన్నీ వేళ్ళ చివర్నించి జరిగిపోతాయి --- పాత మిత్రుడు చాలా కాలం తర్వాత ఊరవతలింటికొచ్చాడు అమ్మ, వాడి బాగోగుల ముచ్చట్లయ్యాక, వాడి భుజాలెత్తుకెదిగిన నా కొడుకు వాడ్ని గుర్తుపట్టకపోయినా జ్ఞాపకంలేదంటూనే అన్న పలకరింపులో ప్రేమ తొణికిసలాడింది --- వీడి పసిడి ఆప్యాయత వాడలవాటు మారలేదు --- అప్పుడప్పుడు కలుద్దాం... మున్ముందు ఫేస్‌బుక్‌లు అప్‌డేట్ అవుతాయి. - జి. సత్య శ్రీనివాస్