కొండ చేను
చెకుముకి రాళ్ళ రాపిడి నిప్పు: ఆమె తలంపు కనుపాప అడవికి పొగ పెట్టింది ఊళ్ళో వాళ్ళందరు రాత్రంతా మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇల్లు వదిలున్నారు నేను మటుకు మర్నాడు కొండపోడులో చేనుమకాం కట్టుకున్నా. చెకుముకి రాళ్ళతో ఆమెకి ముక్కెర కమ్మలు చేయించా ఆమె కళ్ళ లోయ వాగుల్లో అగ్ని పూలు. నా పెదవుల పై సెగ రాత్రంతా ఇద్దరం అడవి పంటకి కంచెలా అల్లుకున్నాం.