నాస్టాల్జియా (14-9-95)


మనయిద్దరి మధ్యా
వెయ్యేళ్ళ అనంతరం
కలిసినట్టుగా
నీ పలకరింపు
కనుపాపకి 
కనురెప్ప కబురు
మనము కలవనూలేం
విడిపోనూలేం
---------
నీతో
మాట్లాడడం
అంతరమధనం
జావాబులేని
ప్రశ్నకి
సుదీర్ఘ చర్చ
---------
వెళుతూ...
వెళుతూ..
వెనుతిరిగిన చూపు
ఆత్మ
దేహం మధ్య
జీవితకాల
పయనం
----
మధువు


ఒకే  తరుణంలో
దు:ఖాన్ని
ఆనందాన్ని
పంచే
మధువు
నీవు
నేను 
తాగుబోతుని
-----
నీ శరీరపు
గుబాళింపు
నా
బూడిద
వర్ణం
------

Comments

Post a Comment

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు