Posts

Showing posts from November, 2012

నీడ సుక్కల నావ

Image
నీడ నీడతోని నాట్లేయంగా... తనువు నేలలో ఒగ్గిన సెమట బిందువుల మొగులు కొడవలి   సూపు కొసన  ఆలి ముద్దు మెర్వంగ నీడ నీడతోని నాట్లేయంగా... ఊడ్పు గింజల  ఆన  దారెమ్మటే పాదముద్దరల డొంకల్లో పల్లకున్న నీళ్ళ బుజాన కంకుల సవ్వడి పాడంగ నీడ నీడతోని నాట్లేయంగా... ( భగీరథపురం,హీరామండలం, శ్రీకాకుళం,జిల్లా,1996 -2000 ఙ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతాయి) 28-11-2012.

పూల రేవు

సూర్యుడి ధూళి రాలినట్టు ఆకాశం తెరచాపయి మా తోటంతా విరబూసింది (మాధవికి)

బ్లాక్ & వైట్

హరివిల్లు నల్ల రేగడి కళ్ళ కనుపాపలో విస్ఫోటించిన  విత్తు

గోడలోని దీపం

ఆత్మలేని గోడలతో సంభాషించినప్పుడు అరికాళ్ళ కింద ఎండుటాకుల చప్పుడు. అందుకే ముసలి గోడలు కూలిపోతాయి

కబూతర్ ఖానా

అనుక్షణం కాలం తీరు మారుతోంది మనస్సుకి నిలకడ లేకుండా పోయింది ఇప్పుడు గత స్మృతుల్ని నెమరేసుకోవడం త్వరగా అలవాటవుతోంది నే  నడిచొచ్చిన దారులన్నిటిలో మట్టి  కవచం చెదిరినట్లు  పరిమళం  లేని తోటలో రుచిలేని పలుకులు పంచుకుంటునట్లు తెల్ల కపోతాలు కరెంటు తీగమీద తెగిపడిన గాలి పటాల్లా అల్లుకు పోయే ఘడియలు వచ్చినట్టు...

ఆత్మ విహంగం

మర్రి ఊడలకింద దీపాలు కాంతి గాల్లో ఎగురుతున్నట్టు ఆత్మలు సీతాకొకచిలుక రంగులై విహరించే రాత్రి ( 1974-2003, నే చూసిన దీపావళి రాత్రి, హిందూ స్మశాన వాటిక, పంజాగుట్ట,)

భాష్యం

చిన్నప్పుడు  తిన్న మట్టి ఇంకా నాలుకకి అంటుకుని వుంది పుడమి  వాక్కు బీజాక్షరం

మైదానం

సాయంకాలం కిటికీ తలుపులు వేస్తుంటే రెండిళ్ళ మధ్య నుండి తొంగి చూస్తున్న చంద్రుడు గేటు దగ్గర అలికిడి వంకర నవ్వుతో పిల్లాడు లోపలి వైపు సైగ చేస్తూ. వాడి బంతినిచ్చేసి పరదాలు వేశా. బాల్యంలో చందమామ గుప్పిట్లో తిరిగే గోళం.

నదింతే(3-2-99 కి సీక్వెల్)

నదింతే... అద్దాల పలకల రాకపోకల ఉత్తరం                                నదింతే...                                నదిబొడ్డులో విరబూసిన                                రెల్లు పూలు                                                        నదింతే...                                                        ఉనికిని రాసుకుంటున్న                                             ...