కబూతర్ ఖానా
అనుక్షణం
కాలం తీరు మారుతోంది
మనస్సుకి నిలకడ
లేకుండా పోయింది
ఇప్పుడు
గత స్మృతుల్ని
నెమరేసుకోవడం
త్వరగా అలవాటవుతోంది
నే
నడిచొచ్చిన దారులన్నిటిలో
మట్టి కవచం చెదిరినట్లు
పరిమళం
లేని తోటలో
రుచిలేని పలుకులు
పంచుకుంటునట్లు
తెల్ల కపోతాలు
కరెంటు తీగమీద
తెగిపడిన గాలి పటాల్లా
అల్లుకు పోయే ఘడియలు
వచ్చినట్టు...
నాటి జ్ఞాపకాలతో నేటి వాస్తవాలు ...మట్టి కవచం చెదిరినట్లు,రుచిలేని పలుకులు
ReplyDeleteపంచుకుంటునట్లు... వుంటాయి తప్పాడు మాష్టారూ. ...రాఘవేంద్ర రావు (కనకాంబరం)