నీడ సుక్కల నావ
నీడ నీడతోని నాట్లేయంగా...
తనువు నేలలో ఒగ్గిన
సెమట బిందువుల మొగులు
కొడవలి సూపు కొసన
ఆలి ముద్దు మెర్వంగ
నీడ నీడతోని నాట్లేయంగా...
ఊడ్పు గింజల ఆన
దారెమ్మటే పాదముద్దరల డొంకల్లో
పల్లకున్న నీళ్ళ బుజాన
కంకుల సవ్వడి పాడంగ
నీడ నీడతోని నాట్లేయంగా...
( భగీరథపురం,హీరామండలం, శ్రీకాకుళం,జిల్లా,1996 -2000 ఙ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతాయి)
28-11-2012.
chala bagunayandi pic and poetry
ReplyDeletethanks andi
ReplyDelete