Posts

Showing posts from July, 2012

నడిచే వర్షం

పెదవుల కొంగు కొస నుండి జారుతున్న... వాన చుక్క మధువు. వెలిసిన  వర్షం  నాలో మధుశాల.

దోసిళ్ళ మడుగు

రాత్రి కప్పల్ని అన్వేషించాను మిణుగు వెలుగు తప్ప నీటి మువ్వల అలికిడి లేదు.

ప్రయాణపు కిటికి

Image
తాటి గర్భంలో మర్రి విత్తనం రూపం మారింది

పొద్దు పోని కాలం

నా  ఉఛ్వాశ నిఛ్వాశ నడుమ రాత్రింబవళ్ళ నిట్టూర్పు

మట్టి తావీజు

శిధిలమైన ఇంటి గోడల్ని అంటి పట్టుకున్న రావి మొలక

మరణానంతర కవిత

Image
చెట్టు మొదళ్ళలో నిక్షిప్త బొగ్గు రాసులు నా చరమ గీతాన్ని వెలికితీస్తాయి

మజిలీ

Image
ఒడ్డంచున చెట్టు విశ్రమిస్తున్న నీటి పొరల పడవ

ఊడ్పులు

Image
ఆమె చేతుల మీదుగా రాలుతున్న గోధుమ రంగు సూరీడు మల్లెకోక ఆవరణాన్ని ఇంటికప్పు చేస్తాడు (ఈ ఏడాది మంచి వర్షాలు పడాలని ఆశిస్తూ)

టూస్క్వేర్

రెండు పిచ్చుకల జంటలు ఒకదాని వెనుక ఒకటి కరెంటు తీగలమీద ముచ్చటించుకున్న తర్వాత రెండు జంటలు ఒకే తీగపైన మధ్యలో మగపిచ్చుకలు చివర్లో ఆడ పిచ్చుకలు మగపిచ్చుకల సంభాషణ ఆడ పిచ్చుకల ప్రశ్నల వర్షం ఈ ధాటికి మగపిచ్చుకల మెడ కుంచించుకుపోయింది. మనలోనూ కరెంటు ఇలానే సరఫరా అవుతుంది