టూస్క్వేర్


రెండు
పిచ్చుకల జంటలు
ఒకదాని వెనుక ఒకటి
కరెంటు తీగలమీద
ముచ్చటించుకున్న తర్వాత
రెండు జంటలు
ఒకే తీగపైన
మధ్యలో
మగపిచ్చుకలు
చివర్లో
ఆడ పిచ్చుకలు
మగపిచ్చుకల
సంభాషణ
ఆడ పిచ్చుకల
ప్రశ్నల వర్షం


ఈ ధాటికి
మగపిచ్చుకల
మెడ కుంచించుకుపోయింది.


మనలోనూ
కరెంటు
ఇలానే
సరఫరా అవుతుంది

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు