మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్
మా ఇంటి వెనుక మైదానంలో కొంత కాలం క్రితం ఆమె, నేను నాటిన మామిడి,చిన్న
వుసిరి, సీతాఫలం ,సపోటా,జామ, నేరేడు, మునగ ,చింత,నిమ్మ, గుల్మొహర్ , వేప మొక్కలు .. హరిత హారంలోభాగంగా నాటిన
కానుగ,రావి మొక్కలు... భారతి ఆంటీ నాటించిన మారేడు, వెలగ మొక్కలు... సుమారు 20 చెట్లు..... కొన్ని పూతకొచ్చాయి ఆ చెట్లిప్పుడు చాలా రకాల పక్షుల నివాస
ప్రాంతాలు ఆ ప్రాంతాన్ని
పిల్లలు ఆడుకోడానికి అనువుగా ప్రొక్లైనర్ తో చదును చేయిస్తున్నారు యంత్రం నేలను చదును చేస్తునప్పుడు చెట్లకు
ఇబ్బంది కలిగి అవి పెకలించబడతాయన్న శ్రద్ధతో కూడుకున్న భయంతోకావలి కూర్చున్నా... వాటికి
నీళ్ళు పోసి, ఆమె ,నేను వాట్ని పిల్లల్లా పెంచాము --------- ఎక్కడినుండో వచ్చింది ఒక చిత్రిత కొంగ ! యంత్రంతో బాటు భయంలేకుండా దాని చుట్టూనే తిరుగుతోంది.ట్రాఫిక్‌లో బాగా తిరిగే
అలవాటున్న ప్రాణంలా . సన్నిహితుడితో నగర రోడ్డుల్లో ఇష్టానుసారంగా తిరిగినట్టు వుంది దాని స్వభావం. ఒకప్పుడు పశువుల పైన వాలి తిరిగే సహజీవన వాసి
అది. చిన్నపాటి అలికిడికి పశువులు తమ తోకాడించేవి. ఆ
సౌ౦జ్ఞకు కొంగ పశువుల నుండి దూరంగా ఎగిరి వాలి, వాట్ని గమనించి మళ్ళీ వచ్చి
వాలేది. ఆ అలవాటు ఇప్పటికీదానిలో
కనపడుత…
అధ్భుతమైన ఆలోచన భావం.
ReplyDeleteతన దోసిటిలో మురిపెంగా పెంచిన మర్రి ఉరి తాటి గా మారుతుందని తాటి ఎనాడైన ఉహించిందా?
ReplyDelete