ఎప్పటికీ కదలకుండా అక్కడే బుద్ధ విగ్రహంలా నిల్చుని వుంటుంది వింటుంది చూస్తుంది సైగలు చేస్తుంది నేను మటుకు దానికి అటు ఇటు పరిగెడుతూనే వుంటాను నా కాలం చెల్లేంత వరకు రోడ్లు విస్తరిస్తునప్పుడు గుడిని జరపకుండా దాన్ని మటుకు కొద్దిగా నెట్టేస్తారు మిత్రులనీడ జాడల్ని కోల్పోయి దిగాలుగా మొహం వేలాడదీసింది. వుండండి! ఇప్పుడే వస్తా!! దాని చుట్టూ తిరిగి దణ్ణం పెట్టి బొడ్డురాయిగా మార్చి!!! (నాకు దారి చూపిన అనేకానేక రకాల మైలు రాళ్ళకి)