Posts

Showing posts from January, 2012

మిడ్ నైట్ రెయిన్ & డే డ్రీమర్స్

చీకటి నుండి వచ్చిన వెలుతురు పిట్టలు పగలు కలలు కనవు చూస్తాయి వెలుతురు చీకటిలో కురుస్తున్నప్పుడు... కలలు మొలకెత్తుతాయి (శిశిరం ఇంట్లో పుట్టిన పూలకు,గువ్వలకు,28-1-2012)

ఇరువురూ

నెలవంక  వెనకాలే నక్షత్రం ఒంటరి ప్రయాణం దారొక్కటే

సంక్రాంతి

చలిగాలికి తెగి ఎగురుతున్న  వేడి తగ్గిన సూరీడు (16-1-2012)

చలిమొక్క

పూలు మత్తుగా విచ్చుకుంటాయి, ఆకులు నిద్రలేవలేదు (16-1-2012)

చలి గుహ

వెలుతురు నుండి గదిలోకి వచ్చిన చీకటి (16-1-2012)

బాల్కనీ

నగ్నకనుపాప చూపు నీడలులేని పరుగై ఎగురుతోంది ----- హద్దుల్ సరిహద్దుల్ వుండని కాలానికి దారయ్యింది ------ గోడలులేని పుడమికి రేయింబవళ్ళ రంగుల వ్యోమగామి చిత్రం. రండి ప్రయాణించండి. (మా బాల్కనీ,8-1-2012)

నీటి గింజ

పైన కింద లోన వుండేది ఇప్పుడు కనుమరుగయ్యింది ------- ఎక్కడ నుంచో వెతికి తెచ్చిన విత్తనాన్ని నాటాను మొలకెత్తలేదు! ------  వెతుక్కుంటూ భూమిని పోరలు పోరలుగా తవ్వాను పూర్వీకుల అస్తికలు ఇంకా లోనికి వెళ్ళాను కొన్ని వందల వేల అడుగుల కింద ప్రవహిస్తూనే వుంది కనిపిస్తే ఆవిరిచేస్తారని!! లోలోన దాక్కుంది!!! తాకుదామని చెయ్యిచాచాను అందకుండా లోలోనికి పారిపోయ్యింది ---------- చూపు పచ్చదనాన్ని కోల్పోయ్యింది. (7-1-2012)

మెసేజ్

ముద్దాడిన పెదవుల పైన ఎంగిలిని చప్పరిస్తున్న నాలుకలా రోజులన్నీ ఇంతే ------ కళ్ళలో ఎగురుతున్న గాలిపటం దారంలా ఆకాశంలోని రింగ్ టోన్ లా కాళ్ళీడ్ఛుకుంటూ నడవడంలా వుండీ లేనట్లే ప్చ్హ్ ... అద్దంలో మొహం ఎండిపోతున్నట్ల్లు రోజులకు రక్త మాంసాలు లేవు ----- మెసేజ్ సెంట్ & రిసీవ్... డ్ (6-1-2012)

పదం

మనతోనే లేచి వుండి... గాయపడి రాత్రిలో చనిపోతుంది మళ్ళీ ఉదయిస్తుంది. (3-1-2012)