నీటి గింజ
పైన
కింద
లోన
వుండేది
ఇప్పుడు
కనుమరుగయ్యింది
-------
ఎక్కడ నుంచో
వెతికి తెచ్చిన
విత్తనాన్ని
నాటాను
మొలకెత్తలేదు!
------
వెతుక్కుంటూ
భూమిని
పోరలు
పోరలుగా
తవ్వాను
పూర్వీకుల
అస్తికలు
ఇంకా
లోనికి
వెళ్ళాను
కొన్ని
వందల వేల
అడుగుల
కింద
ప్రవహిస్తూనే వుంది
కనిపిస్తే
ఆవిరిచేస్తారని!!
లోలోన
దాక్కుంది!!!
తాకుదామని
చెయ్యిచాచాను
అందకుండా
లోలోనికి
పారిపోయ్యింది
----------
చూపు
పచ్చదనాన్ని
కోల్పోయ్యింది.
(7-1-2012)
nice
ReplyDelete