144సెక్షన్
అలజడి తర్వాత నిశ్శబ్దంలా... నగరం రోడ్లు కుబుసం వదుల్తున్న పాముల్లా... ఒక ఘటన సంఘటన నడుమ నగరం రోడ్లు నిద్రపోవు పోనివ్వవు బతుకుకు వెళ్ళిన వాళ్ళకోసం ఇంట్లో వాళ్ళు కిటికి చువ్వలకు వేళ్ళాడేసిన చూపుల్లా... ఈ అంతరంలో వార్తల్లో విరామంలా నిర్జీవ రోడ్లు కొత్త దుస్తులు వేసుకుంటాయి