Posts

విద్యుత్ తీగ

కరెంటు తీగలు గాలి పటాల గూళ్ళు పూబంతి ప్రవాహాలు చిరిగిన జ్ఞాపకాల  శ్వాస శబ్దాలు 2. తరచూ కరెంటు స్థంభాల మార్గంలో వెళుతునప్పుడు తీగలకు చుట్టుకుపోయిన పతంగులు చిన్ననాటి ఉత్తరాల  దొంతరలు పురాతనింటి దూలానికి వేళ్ళాడుతూ మిగిలిపోయిన వుబుసుపోని గాలికబుర్ల  మూటల్లా దర్శనమిస్తాయి 3. విధ్యుత్ కోత ఓ అబద్ధం కంట్లోని జలాశయం నుండి విధ్యుత్ ఉత్పత్తవుతుంది 4. వైర్ లెస్ కాలంలో అప్పుడప్పుడు పాత ఉత్తరాల్ని పక్షుల గాలాక్షరాలతో చదువు కుంటాను నాలోని తీగ మీద కనిపించకుండా కూర్చున్న వాళ్ళ అనుబంధాన్ని నెమరేస్కుంటూ 5. ఇంకప్పుడు నాలోని నేను అక్షరాల్లా మీ ఉహాతంతుర్లో తీగనుండి రాలుతున్న మంచు బిందువులా రెపరెపలాడుతూ  తచ్చాడుతాను (25-1-15,లెనిన్ నగర్)

మట్టి విత్తనాలు -1

చెట్ల ఆకులు పక్షుల  రెక్కలు ఉదయమే ఒళ్ళు విదిల్చి,ఆవలిస్తాయి అందుకే చెట్టు గాలికి ఊగుతుంది రాత్రి పిట్టలు తిరిగి వచ్చినప్పుడు గడపెదుట వాలుతాయి అప్పుడు అందరూ కలిసి ఆకాశాన్నితిరగేసి వూపుతారు అందుకే రాత్రవుతుంది అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు చుట్టు పక్కల ఆవరణలో రెక్కలాకుల మాటలు వెన్నెల గింజల్ని  నాటుతాయి - కధ ముగిసే లోపే పిల్లలు నిద్రలోకి జారుకుంటారు అప్పటికే పిల్లల  కలల్లో కొన్ని బీజాలు  మొలకెత్తుతాయి - పిల్లలు మట్టి రెక్కల  విత్తనాలు  ( 27-11-14)

జ్ఞాన ఫల వృక్షం

1.ఈ చెట్టు కింద కూర్చుని నాతో నేను నా అమ్మతో నా సఖితో నా కొడుకుతో నా వాళ్ళతో ఎన్నో సార్లు ముచ్చటించా కొన్ని మార్లు నాలో నేను ఎల్లప్పుడూ అది మౌనంగా తనలోని ఆకుల సవ్వడి లా ఓ కొమ్మకొనల తుంపర వర్షంలా ప్రతిస్పందించింది 2. మరో చోట దూరంగా ఒంటరిగా నా జీవితపు గెలుపోటమిని బేరీజు వేస్కుంటూ రెండువైపుల్న గెలుపోటములున్న తన ఆకుల నాణాన్ని ఎన్నెన్నోసార్లు గాలిలో ఎగరేసి లెక్కేసుకుంటూ గాలివాటంలా పరిగెట్టానో... దాని ఆకుల చూపులకీ దాని సహచరికీ మధ్య జరిగిన మౌన చూపుల సంభాషణ కే తెలియాలి నాకు వచ్చే కబురల్లా  గాలి తంత్రాల జీవన శ్వాస చిత్ర రేఖల తరంగాల వేద రహస్యం 3. నా లానే ఎందరో దాని చుట్టూ వాలి వెళ్ళి పోతారు 4. ఇప్పుడు భారమైన మనస్సు నీరసించింది తరుచు తరుచు తన వారసత్వపు పసి మొలకల్ని తన చేరనే వుండి బాల స్పర్శతో తనని తానూ  స్ప్రుజించుకోవాలని ఆరాటపడుతుంది మగతలో తనలో తానూ చిన్న అలికిడైనా ఎవరొచ్చారు ఎలావున్నారు బాగా వుండు బాగా చదువుకో అని కలవరిస్తుంది తన నీడ బాట లో వున్న ఊట బావి శబ్దంలా 5. కొన్ని...

చెకుముకిరాళ్ళడవి

ఏ అడవిని చూసినా... ఆకులిప్పుడు కొమ్మలకు ఉరేసుకుని వేలాడుతున్నట్లున్నాయి వేర్ల కింద మట్టిగుట్టల్లో ఇంకిన రక్తమాంసముద్దల్లా అంతా ఖననమే నేలని తవ్విన తర్వాత  పైనేముంటుంది బూడిద తప్ప భూమిప్పుడు రక్తపు మరకలతో ప్రధక్షణ చేస్తోంది గోడమీద ఎర్రటి కణాలంటించుకున్న సూరీడు వీధులెమ్మట నినాదాలు చేస్తూ తిరుగుతున్నడు రాత్రి పలక మీద చంద్రుడు పేలిన గ్రనైట్ల రంధ్రాలనుండి వెలువడే ధూళి అనుదినం జీవన్మరణ మధ్య జరిగే పొరాటాలలో అమాయకంగా అనామకులైన స్థానికులే ఇప్పుడూ కనిపించే నక్షత్రాలు వాటి చీకటే మనకు కనిపించే వెలుగు ఇకవున్న వారు కొమ్మలకు వేలాడుతున్న జివచ్చవ ఆకులు అనాదిగా అడవి పచ్చగానే కనిపించింది చెట్టుకింద భూమిలేని వేరుకతలు కతలు కతలుగా చెప్పారు , విన్నారు అహోరాత్రులు పచ్చంచు రగులుతూనే వుంది నిప్పంటించిన వారు , కాసుకునే వారు అంతా ఎవరి దారిలో వాళ్ళు సాగుతూనే వున్నారు అక్కడివార్నే అడవిని నాశనం చేసారని ధూషించారు , నిందుతులని ముద్రించారు చివరకి రాక్షసులు అన్నారు వాళ్ళకి హక్కులున్నాయన్న మాట అంతా హూళక్కే ఇవన్నీ పధకం ప్రకారం జరుగుతా...

సంభాషణ రేఖ

ప్రతి ఉదయం పిచుక ముక్కుతో సూర్య కిరణం   కిటికీ అద్దం మీద చప్పుడు చేస్తుంది సరిహద్దులంచున నిల్చున్న నిర్వాసితుల్లా పిచుక , నేను పలకరించుకుంటాం   అరి కాళ్ళల్లో గుచ్చుకున్న ముల్లు అద్దంలో చూపై నిలుస్తుంది ఎర్ర గులాబి లా ఉదయం విచ్చుకుంటుంది   ఎప్పటికి చెరగని రేఖా చిత్రాల్లా పాత ఊసులు కొత్తగా చిరుగించుకుంటాయి మాయని గాయాల్ని జ్ఞాపకం చేసి తిరిగి పిచుక ఎదురుగా వున్న కరెంటు తీగ పైన కుర్చుని అటు , ఇటు తలాడిస్తూ గాలితో కబుర్లు చెప్పుకుంటుంది   నేను కిటికీ అద్దంలో నా మొహాన్ని అరచేతి కళ్ళరేఖలతో తడుముకుంటూ నిలిచిపోతా   పెనవేసుకున్న వెంటనే తెగిపోయే గాలి పటం దారం లా మా చూపులు గర్భసంచి మార్పులో విడిపోయిన మట్టి పిండం లా రేఖా మాత్రా స్ధానంలో అజ్ఞానుతులుగా ఒకే ఉదయాన్ని , ఒకే రేఖ పైన రెండు కోణాల్లో ఒకే సారి అవిష్కరిస్తు , సరిహద్దుకిటికీ రేఖల  ఇనుప కంచలో వేలాడుతాయి ప్రతి ఉదయం ,.. కోడికూతతో పొడవదు సరిహద్దుల యుద్ధంలో మరణించిన అజ్ఞాత  ఆత్మలు గగనంలో కలిసిపోతునట్టు సూర్యుడు సరిహద్దు రేఖ పై పై కి ఎగబాకుతూ వెళుతుంటా...

మనమెవరం ?

ఒకరితో ఒకరు కలవలేక కరచాలనంతో గొంతులు నులిమేస్తాం కలిశామన్న భ్రమతో పడుకుంటాం ఇటుక ముక్కల దేహంలో గాలివాటాన్ని హత్తుకునే గాలి పురుగులం గాలిలో నీటిలో ప్రయాణించే ఆలోచనలకు దాపరికాలుండవు సముద్రంలో ఒదిగిపోయిన వూసుకు ఊహలుండవు ఉప్పునీటి శవ యాత్రలకు ఉప్పెనలుండవు తడి తెలియని వేర్లకి అబద్ధమైతేనేమి నిజమైతేనేమి ఏ అరమరికలు లేకుండా నిద్రవాటికలో ఎవరి ఖాళీలను వారు పూరిద్దాం దారి,తెన్నూ లేని మృత్యువుకి బాటలవుదాం ఎవరైతేనేమి... ? (1997)

తుంపర వర్షం

ఆకులపై నుండి తుంపర్ల  గాలి నను తాకుతూ సాగిపోతుంది పెదవులకున్నముద్దె౦గిల్ని  తడిచేసుకుంటూ  చూపుడు వేలుతో పేజీలు తిరగేస్తున్నాను ఆకు చివరి నుండి బొట్టు బొట్టుగా రాలుతున్న చినుకులు వేర్ల లోకి ఇంకుతూ ఇరు తనువుల మట్టి మనస్సు ఒకటైన వేళలా తెల్ల సంఫెంగల పరిమళం చీకటికి ధూపమేస్తోంది ముగింపు పేజిలో అసలు కధ మొదలైనట్టు   అంతలోనే ఆమె రింగ్ టోన్ ‘ ఇమ్లిబన్ లో బస్ ఎక్కాను ,మొక్కలు జాగ్రత్త ’ ‘ సరే అక్కడ వర్షం వుందా ’ ‘ ఆ.. తుంపర్లు పడుతున్నాయి ’ ఇక చింత లేదు తడిగాలి నమ్మకం ఇరువురికీ డ్రైవరైనట్టు ఇక ఎడబాటు లేని ప్రయాణం కొనసాగుతుంది... (20-9-14)