చెకుముకిరాళ్ళడవి

ఏ అడవిని చూసినా...
ఆకులిప్పుడు కొమ్మలకు ఉరేసుకుని వేలాడుతున్నట్లున్నాయి
వేర్ల కింద మట్టిగుట్టల్లో ఇంకిన
రక్తమాంసముద్దల్లా
అంతా ఖననమే
నేలని తవ్విన తర్వాత  పైనేముంటుంది
బూడిద తప్ప

భూమిప్పుడు రక్తపు మరకలతో
ప్రధక్షణ చేస్తోంది
గోడమీద ఎర్రటి కణాలంటించుకున్న
సూరీడు
వీధులెమ్మట నినాదాలు చేస్తూ తిరుగుతున్నడు
రాత్రి పలక మీద చంద్రుడు
పేలిన గ్రనైట్ల
రంధ్రాలనుండి వెలువడే ధూళి


అనుదినం జీవన్మరణ
మధ్య జరిగే పొరాటాలలో అమాయకంగా అనామకులైన
స్థానికులే
ఇప్పుడూ కనిపించే నక్షత్రాలు
వాటి చీకటే
మనకు కనిపించే వెలుగు
ఇకవున్న వారు
కొమ్మలకు వేలాడుతున్న
జివచ్చవ ఆకులు

అనాదిగా అడవి పచ్చగానే కనిపించింది
చెట్టుకింద భూమిలేని వేరుకతలు
కతలు కతలుగా చెప్పారు,విన్నారు
అహోరాత్రులు పచ్చంచు
రగులుతూనే వుంది
నిప్పంటించిన వారు, కాసుకునే వారు
అంతా ఎవరి దారిలో వాళ్ళు
సాగుతూనే వున్నారు
అక్కడివార్నే
అడవిని నాశనం చేసారని ధూషించారు, నిందుతులని ముద్రించారు
చివరకి రాక్షసులు అన్నారు
వాళ్ళకి హక్కులున్నాయన్న మాట
అంతా హూళక్కే
ఇవన్నీ పధకం
ప్రకారం జరుగుతాయి
కూలి చేయడం రాని వార్కి
కూలి నేర్పించడం

ఆడవి దారి మాయ దారి
వున్న చోటనే ప్రదక్షణ చేయిస్తూ...
ముందుకు సాగుతున్నామన్న భ్రమ కల్పిస్తుంది

కొద్ది కొద్దిగ చెప్పుకుంటూ వస్తున్నా
లోన కథలు, లోనికి వేళ్ళే సూడాలి
బయటొడి మాటలు నమ్మొద్దు

తర తరాలుగా
ఆకులు రాలుతూనే వున్నాయి
ఇక పైనన్నా చెట్లకు
ముచ్చటైన నవ్వేఆకులుండాలి
అక్కడోళ్ళ గూళ్ళు అల్లుకోవాలి

అప్పుడే నేలకు
నీడుంటది
ఇక ముందెనుక మాటలొద్దు
చూసొచ్చి చెప్పండి
ఆకు మీద నీటి బొట్టు
నాలిక మీద రాలితే
మోదుగ కొలిమి
విస్తరలో
నిప్పుల వర్షం కురిపిస్తుందని!
చెకుముకిరాళ్ళడవి ఆన


(19-6-13)

Comments

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు