విద్యుత్ తీగ
కరెంటు తీగలు
గాలి పటాల గూళ్ళు
పూబంతి ప్రవాహాలు
చిరిగిన జ్ఞాపకాల శ్వాస శబ్దాలు
2.
తరచూ కరెంటు స్థంభాల మార్గంలో
వెళుతునప్పుడు
తీగలకు చుట్టుకుపోయిన
పతంగులు
చిన్ననాటి ఉత్తరాల దొంతరలు
పురాతనింటి దూలానికి వేళ్ళాడుతూ
మిగిలిపోయిన
వుబుసుపోని గాలికబుర్ల మూటల్లా
దర్శనమిస్తాయి
3.
విధ్యుత్ కోత
ఓ అబద్ధం
కంట్లోని జలాశయం నుండి
విధ్యుత్ ఉత్పత్తవుతుంది
4.
వైర్ లెస్ కాలంలో
అప్పుడప్పుడు
పాత ఉత్తరాల్ని
పక్షుల గాలాక్షరాలతో
చదువు కుంటాను
నాలోని తీగ మీద
కనిపించకుండా కూర్చున్న వాళ్ళ అనుబంధాన్ని
నెమరేస్కుంటూ
5.
ఇంకప్పుడు
నాలోని నేను
అక్షరాల్లా
మీ ఉహాతంతుర్లో
తీగనుండి
రాలుతున్న మంచు బిందువులా
రెపరెపలాడుతూ తచ్చాడుతాను
(25-1-15,లెనిన్ నగర్)
Comments
Post a Comment