సంభాషణ రేఖ

ప్రతి ఉదయం
పిచుక ముక్కుతో సూర్య కిరణం
 కిటికీ అద్దం మీద చప్పుడు చేస్తుంది
సరిహద్దులంచున నిల్చున్న నిర్వాసితుల్లా
పిచుక,నేను పలకరించుకుంటాం
 అరి కాళ్ళల్లో గుచ్చుకున్న ముల్లు
అద్దంలో చూపై నిలుస్తుంది
ఎర్ర గులాబి లా ఉదయం విచ్చుకుంటుంది
 ఎప్పటికి చెరగని రేఖా చిత్రాల్లా
పాత ఊసులు కొత్తగా చిరుగించుకుంటాయి
మాయని గాయాల్ని జ్ఞాపకం చేసి
తిరిగి పిచుక ఎదురుగా వున్న కరెంటు తీగ పైన కుర్చుని
అటు ,ఇటు తలాడిస్తూ గాలితో కబుర్లు చెప్పుకుంటుంది
 నేను కిటికీ అద్దంలో నా మొహాన్ని అరచేతి కళ్ళరేఖలతో తడుముకుంటూ నిలిచిపోతా
 పెనవేసుకున్న వెంటనే తెగిపోయే గాలి పటం దారం లా
మా చూపులు గర్భసంచి మార్పులో విడిపోయిన మట్టి పిండం లా
రేఖా మాత్రా స్ధానంలో అజ్ఞానుతులుగా
ఒకే ఉదయాన్ని ,ఒకే రేఖ పైన
రెండు కోణాల్లో ఒకే సారి అవిష్కరిస్తు,
సరిహద్దుకిటికీ రేఖల  ఇనుప కంచలో వేలాడుతాయి
ప్రతి ఉదయం,..
కోడికూతతో పొడవదు
సరిహద్దుల యుద్ధంలో మరణించిన అజ్ఞాత  ఆత్మలు గగనంలో కలిసిపోతునట్టు
సూర్యుడు సరిహద్దు రేఖ పై పై కి ఎగబాకుతూ వెళుతుంటాడు
కాని ఈ రోజు ఉదయం పొగమంచులో
పిచుక మొహం
సూర్యుడు
నిన్న రాత్రి జరిగిన ఘర్షణల్లో
మృతులైయిన వారి మొహాలు
తెల్లబడ్డట్టుగా వున్నాయి

(25-10-14)

Comments

  1. beautiful poem sir.. enough for this day to memorize the feel of this poem.. it is like a warm rain in the winter season.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు