జ్ఞాన ఫల వృక్షం

1.ఈ చెట్టు కింద కూర్చుని
నాతో నేను
నా అమ్మతో
నా సఖితో
నా కొడుకుతో
నా వాళ్ళతో
ఎన్నో సార్లు ముచ్చటించా
కొన్ని మార్లు
నాలో నేను
ఎల్లప్పుడూ అది మౌనంగా
తనలోని ఆకుల సవ్వడి లా
ఓ కొమ్మకొనల తుంపర వర్షంలా
ప్రతిస్పందించింది

2. మరో చోట
దూరంగా ఒంటరిగా
నా జీవితపు
గెలుపోటమిని బేరీజు వేస్కుంటూ
రెండువైపుల్న
గెలుపోటములున్న
తన ఆకుల నాణాన్ని
ఎన్నెన్నోసార్లు
గాలిలో ఎగరేసి లెక్కేసుకుంటూ
గాలివాటంలా పరిగెట్టానో...
దాని ఆకుల చూపులకీ
దాని సహచరికీ మధ్య జరిగిన మౌన చూపుల
సంభాషణ కే తెలియాలి
నాకు వచ్చే కబురల్లా
 గాలి తంత్రాల
జీవన శ్వాస
చిత్ర రేఖల తరంగాల
వేద రహస్యం

3. నా లానే ఎందరో
దాని చుట్టూ
వాలి
వెళ్ళి పోతారు

4. ఇప్పుడు
భారమైన మనస్సు
నీరసించింది
తరుచు తరుచు
తన వారసత్వపు
పసి మొలకల్ని
తన చేరనే వుండి
బాల స్పర్శతో తనని తానూ  స్ప్రుజించుకోవాలని ఆరాటపడుతుంది
మగతలో
తనలో తానూ
చిన్న అలికిడైనా
ఎవరొచ్చారు
ఎలావున్నారు
బాగా వుండు
బాగా చదువుకో
అని కలవరిస్తుంది
తన నీడ బాట లో వున్న
ఊట బావి శబ్దంలా

5. కొన్ని పక్షులు
వచ్చి
పరామర్శించి
త్వరగా కోలుకోమని
చెట్టుకి ముడుపులిచ్చినట్టు
పళ్ళు ఇచ్చివెళతాయి

6. జ్ఞానోదయం
ఇప్పుడిప్పుడే
నాకు అర్ధమౌతోంది
జ్ఞానం
కొన్ని చెట్ల కింద
మనలో ఎందుకు ఉద్భవిస్తుందని
బహుశా
నీడను పంచే గుణం
చెట్లకే వుండడం వల్ల కాబోలు
అందుకే మనం
వంశ వృక్షం రాస్కుంటాం
అనుకుంటా

7.శాఖోపశాఖలు
ఈ చెట్టు
గంగను భువికి తెచ్చిన
గరళకంఠుని కడువ

8. నా నమ్మకం
అది త్వరలోనే కోలుకుంటుందని
ఆ నమ్మకం ఒమ్ముకాదనీ
నమ్మకం

 9.ఎందుకంటే
కొన్ని గుళ్ళు
గూళ్ళు
ఆ చెట్టు నీడనే
నేలనల్లుకున్న విహంగాలు


( మామయ్య ( ముప్పనేని కోటేశ్వరరావు) గారికి,చల్లపల్లి,25-12-2014)

Comments

  1. ఒరేయ్ బాబాయ్.... చెట్టు చుట్టూ నువ్వు నవయవ్వనాల నుంచీ కొట్టే చెక్కర్లు నాకు నిక్కర్లప్పటినుంచీ పరిచయం. కానీ నీ ఇటీవలి ప్రతి ప్రదక్షణలో ఒక నవీన హరిత పత్రమేదో నీకే గోచరమవుందని లోకానికి చెప్పచూస్తున్నావేమో ఓ ప్రవక్తలా అనిపిస్తోంది రా.

    ReplyDelete
  2. Thanks Anantu, Bahusa pardakshana chestu chettu kommaki taaveju navutunna nemo!

    ReplyDelete
  3. Thanks Anantu, Bahusa pardakshana chestu chettu kommaki taaveju navutunna nemo!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు