మనమెవరం ?
ఒకరితో ఒకరు కలవలేక
కరచాలనంతో గొంతులు
నులిమేస్తాం
కలిశామన్న భ్రమతో పడుకుంటాం
ఇటుక ముక్కల దేహంలో
గాలివాటాన్ని హత్తుకునే
గాలి పురుగులం
గాలిలో నీటిలో ప్రయాణించే
ఆలోచనలకు దాపరికాలుండవు
సముద్రంలో ఒదిగిపోయిన
వూసుకు ఊహలుండవు
ఉప్పునీటి శవ యాత్రలకు
ఉప్పెనలుండవు
తడి తెలియని వేర్లకి అబద్ధమైతేనేమి
నిజమైతేనేమి
ఏ అరమరికలు లేకుండా
నిద్రవాటికలో
ఎవరి ఖాళీలను
వారు పూరిద్దాం
దారి,తెన్నూ లేని మృత్యువుకి
బాటలవుదాం
ఎవరైతేనేమి... ?
(1997)
Comments
Post a Comment