Posts

Showing posts from September, 2013

తోట

మొలకలు  నాటిన  తర్వాత  ఆమె   మట్టిఅరచేతులని కడుక్కుంటుది  ఇక నేలంతా సీతాకోకచిలుకల  రంగులు  మొలకెత్తుతాయి  (28-6-13)

లంగరు

Image
గాలి వీచినప్పుడల్లా వల మీద నీడలు  అలల్లాగనే పయనిస్తాయి కొన్ని వల అలలో చిక్కడిపోవడం మంచిదే (17-6-13)

మధ్యాహ్నం 12 గంటలు

కరెంటు  తీగ పైన  ఏకాకి  బాల్కనీ లో  నేను  శూన్యం  లోకి  ఇద్దరి  దృష్టి  విశాలమైన  మైదానంలో   మిగిలిన  అవశేషాల్లా  కొన్ని చెట్లు   వాటి  చోట మొలిచే   కొత్త ఇళ్ళు  కొత్తింటిని  తడపడానికి  వాటర్  ట్యాంకర్  నిండా  నీళ్ళు  ఇక్కడి  చూపుల  గూళ్ళన్నీ  దప్పిక గుండలే  ! (28-5-13)

ఖననం

రాగి ఖనిజ వెలికితీతని ఆపారు పురావస్తు శాఖకి బుద్ధ విగ్రహాల్ని వెలికి తీసే అవకాశం లభించింది మట్టి ఖనిజ  జ్ఞానం మట్టిలో కలిసేంతవరకు అర్ధం కాదు (25-5-13)

గడ్డి మైదానం

భూ గర్భడవి నా అడుగులకి గొడుగు పట్టింది ప్రయాణమంతా గొల్లభామ నడక. (15-7-13)

న్యూడ్ ట్రీ

శరీరంలోని  గడియారం  కుబుసంవదులుతోంది  ఇప్పుడు  రాలుతున్న ఆకులన్నీ  నా పచ్చటి     బూడిద వర్ణ గీతాలు  కాస్టంలోని మంట  ఆకాశం కొప్పులో  మోదుగ  పువ్వు  శిశిరం చెట్టు  నగ్నదేహా త్మ  3-4-13)