మధ్యాహ్నం 12 గంటలు
కరెంటు తీగ పైన ఏకాకి
బాల్కనీ లో నేను
శూన్యం లోకి
ఇద్దరి దృష్టి
విశాలమైన మైదానంలో
మిగిలిన అవశేషాల్లా కొన్ని చెట్లు
వాటి చోట మొలిచే కొత్త ఇళ్ళు
కొత్తింటిని తడపడానికి
వాటర్ ట్యాంకర్ నిండా నీళ్ళు
ఇక్కడి చూపుల
గూళ్ళన్నీ
దప్పిక గుండలే !
(28-5-13)
Comments
Post a Comment