Posts

Showing posts from August, 2013

కిటికి

మట్టంటుంకున్న  ఆకుఎముకల గూడు కన్ను వెలుతురుబుడ్డి (15-7-13)

యెవ్వలుండరు

వున్నోళ్ళు కాకపోయిరి లేనోళ్ళు కానకపోయిరి పట్టుకుంటకెవ్వరులేరు పిల్లలు పిల్లల్ని సాక్కోవాలె బొమ్మాటలో అమ్మలైరి నేలపాలైన అరికాల్లోన్ని గోరింటాకు చెమ్మలెక్క! పున్నమి యెన్నెల్ల తడి (11-5-13)

నేల తరం

ఉదయం  సూర్యుడు రాక మునుపు ఆకాశం చంద్రుడి వెలుగుని విదుల్చుకుని వెళ్ళిపోతుంది సాయంత్రం చంద్రుడు వచ్చేముందు ఆకాశం సూర్యుడి కాషాయ రంగుని అద్ది వెళ్ళి పోతుంది ఇంటి ముందు  కళ్ళాపు చల్లి ముగ్గులేసిట్టినట్లు... నగరంలో ఈ కాలాల్లో ఇంట్లో కరెంటు దీపాలు వెలిగించుకుంటారు వాకిలి కిటికి రంగుని లోనికి రానియ్యకుండా... నేల ముంగిట తరం మారింది ( 17-6-13)

ముద్దూ ముచ్చట

వరి మొలకల్ని నాటేటప్పుడు ఆడవాళ్ళు                     నేల                 వేరు                గింజ రూపాలు  వాళ్ళ మట్టి వేళ్ళని ముద్దాడాలని వుంటుంది (17-6-13)

సహచరులం

చనిపోయిన నక్షత్రాల కాంతి ఇంకా ప్రసరిస్తూనేవుంది ఇప్పుడే పుట్టిన తారల వెలుగు ఇంకా మనను తాకలేదు నీటి జిలుగుల ప్రవాహ నది భూమి అగుపించని పురుగు రెక్కల నిప్పుల కంబళి ఆకాశం రేఖల ఒడ్డున నేను నేల నింగి సమాంతర ప్రయాణి 'కులం' (26-5-13)

మిస్సవుతున్న బొడెద్దులకి...

ఆకాశం జీవ నది కాదు పొద్దున్నే తెల్ల బట్టల్ని సాయంత్రం నల్లబట్టల్ని ఆరెసుకునే నది రేవమ్మటి ఒక ఇసుక మైదానం  ఒడ్డంచున అక్కడక్కడ మిగిలిన కొండలు అంతరిస్తున్న చాకిరేవులు లేని  గుండ్రటి బోడెద్దులు కళ్ళతో చూడ్డం తప్ప మిగిలిందేం లేదు (బోడెద్దు అంటే గాడిద) (17-6-13)